
భక్తిశ్రద్ధలతో గంధం సమర్పణ
హొళగుంద: ఉరుసులో భాగంగా ఎల్లార్తి శేక్షావలి, షాషావలి తాతలకు గురువారం రాత్రి భక్తిశ్రద్ధలతో గంధం సమర్పించారు. దర్గా నుంచి గంధంతో బయలుదేరి గ్రామ పురవీధల గుండా ఊరేగింపు నిర్వహించి తిరిగి దర్గాకు చేర్చారు. ఊరేగింపులో భాగంగా భక్తులు కర్రసాము, ఇతర విన్యాసాలను ప్రదర్శించారు. వేడుకల్లో పాల్గొన్న భక్తులు ప్రత్యేక ఫాతెహాలు చేశారు. శుక్రవారం ఉరుసు, శనివారం జియారత్‌తో ఉత్సవాలతు ముగుస్తాయి. ఉత్సవాలకు వచ్చిన భక్తులకు అవసరమైన ఏర్పాట్లు కల్పించినట్లు వక్ఫ్‌బోర్డు ఈఓ ఇమ్రాన్‌ఖాన్, దర్గా నిర్వాహకుడు షాఫీర్‌ఖాన్ తెలిపారు. ఉరుసులో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య ఆధ్వర్యంలో ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి, హొళగుంద ఎస్‌ఐ దిలీప్‌కుమార్ బందోబస్తు నిర్వహించారు.