● ఒకరు మృతి..ఆరుగురికి గాయాలు
అవుకు(కొలిమిగుండ్ల): పాత చెర్లోపల్లె బస్టాప్ వద్ద గురువారం ఆటోను బులెరో వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరో ఆరుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు.. రామాపురానికి చెందిన ఆటో డ్రైవర్ లతీఫ్‌బాషా రామాపురం, చెర్లోపల్లెకు చెందిన ప్రయాణుకులను ఎక్కించుకుని అవుకు బయలు దేరాడు. మార్గమధ్యలో పాత చెర్లోపల్లె బస్టాప్ సమీపంలోని మలుపు వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. ప్రమాదంలో ఆటో బోల్తా పడటంతో చెర్లోపల్లెకు చెందిన నులక రాముడు(55) అక్కడికక్కడే మృతిచెందగా ఆటో డ్రైవర్ లతీఫ్‌బాషా, రామాపురం శివాలయం పూజారి ఆనంద్‌శర్మతో పాటు మరో నలుగురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన లతీఫ్‌బాషాను నంద్యాలకు, మిగతావారిని అవుకు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు.
పాఠశాల భవనం నాణ్యతపై డీఈఓ ఆగ్రహం
మంత్రాలయం రూరల్: మండల కేంద్రంలోని స్థానిక జీనియస్ గ్లోబల్ స్కూల్ భవనం నాణ్యతపై డీఈఓ శామ్యూల్ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పాఠశాలను డీఈఓ తనిఖీ చేశారు. పాఠశాల భవనం నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని యజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 రోజుల్లో తరగతి గదుల్లో సీలింగ్ వేయించాలని ఆదేశాలు జారీ చేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్యతో పాటు బేసిక్ విద్యపై టీచర్లు దృష్టి సారించాలన్నారు. విద్యార్థులకు స్టేట్ సిలబస్ బోధించాలన్నారు. ఎంఈఓలు ప్రైవేట్ పాఠశాలలో నాణ్యత ప్రమాణాలు పరిశీలించాలని, సౌండ్ నెస్ సర్టిఫికెట్ డిప్యూటీ ఇంజినీర్‌తో పొందాలని డీఈఓ ఆదేశించారు. అనంతరం సీఆర్‌పీలు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డీఈఓకు అందజేశారు.
యువకుడి ఆత్మహత్య
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని ఎద్దుల మార్కెట్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి బోయ మధు(20) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. బోయ శ్రీరాములు, శంకుతలమ్మల కుమారుడు మధు ఆటో డ్రైవర్‌గా ఉంటూ వాటర్‌క్యాన్లను సప్‌లై చేసేవాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడు. బుధవారం రాత్రి భోజనం చేసిన తరువాత గదిలోకి వెళ్లి పడుకున్నాడు. గురువారం ఉదయం తలుపులు ఎంతకూ తెరవకపోవటంతో తల్లిదండ్రులు బద్దలు కొట్టి చూడగా ఫ్యాన్‌కు వేళాడుతూ కనిపించాడు. చుట్ట్టుపక్కల వారి సాయంతో కిందకు దించి చూడగా అప్పటికే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు టౌన్ సీఐ శ్రీనివాసులు తెలిపారు.
గాయపడిన ఆటో డ్రైవర్ లతీఫ్‌బాషా
మృతి చెందిన
నులక రాముడు
ఆటోను ఢీకొన్న బొలెరో వాహనం
ఆటోను ఢీకొన్న బొలెరో వాహనం
ఆటోను ఢీకొన్న బొలెరో వాహనం