
ఉప్పొంగిన బుచ్చమ్మ కుంట
● నీట మునిగిన
పంట పొలాలు
● స్తంభించిన రాకపోకలు
కంపమల్ల సమీపంలో ఉప్పొంగి
ప్రవహిస్తున్న బుచ్చమ్మ కుంట
వరద పోటెత్తడంతో నిలిచిపోయిన రాకపోకలు
నీట మునిగిన పంట పొలాలు
కోవెలకుంట్ల: మండలంలోని కంపమల్ల– ఉయ్యాలవాడ ఆర్‌అండ్‌బీ రహదారిలో గురువారం బుచ్చమ్మ కుంట ఉప్పొంగి ప్రవహించింది. కుంట ఎగువ ప్రాంతాలతోపాటు వాగులు, వంకలు, పొలాల్లోని నీరంతా కుంటలో చేరడంతో కుంటపై లెవల్ వంతెనపై వరదనీరు పోటెత్తింది. ఆర్‌అండ్‌బీ రహదారిపై వరదనీరు ఉధృతంగా ప్రవహించడటంతో కంపమల్ల, క్రిష్టిపాడు, హరివరం తదితర గ్రామాల ప్రజలకు కోవెలకుంట్ల, దొర్నిపాడు ప్రాంతాలకు వెళ్లేందుకు రాకపోకలు స్తంభించి పోయాయి. ఆయా గ్రామాల ప్రజలు ఉయ్యాలవాడ మీదుగా రాకపోకలు కొనసాగించారు. కుంట పరివాహకంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన మిరప, వరి, మినుము, తదితర పంటలు నీట మునిగి నష్టం వాటిల్లింది.

ఉప్పొంగిన బుచ్చమ్మ కుంట

ఉప్పొంగిన బుచ్చమ్మ కుంట

ఉప్పొంగిన బుచ్చమ్మ కుంట