
మోటారు సైకిల్‌ను ఢీకొట్టిన కారు
● భార్య మృతి..భర్తకు తీవ్ర గాయాలు
కోడుమూరు రూరల్/సి.బెళగల్: కె.నాగలాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్దపాడు వద్ద మోటారు సైకిల్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందారు. ఈ దుర్ఘటన ఆదివారం చోటు చేసుకుంది. సి.బెళగల్ మండలం పోలకల్‌కు చెందిన వెంకటేశ్వరరెడ్డి, భార్య అరుణమ్మ(50)తో కలిసి బైక్‌పై కర్నూలు వెళుతుండగా, ఇదే సమయంలో కర్నూలు నుంచి పెద్దపాడు వైపు వస్తున్న కారు శ్రీరామ వెంచర్ వద్ద ఢీకొట్టింది. ప్రమాదంలో మహిళ అరుణమ్మ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందగా, వెంకటేశ్వరరెడ్డికి గాయాలయ్యాయి. గాయపడిన వెంకటేశ్వరరెడ్డిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కె.నాగలాపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో సోమేశ్వర గ్రామైఖ్య సంఘానికి దాదాపు పదేళ్లుగా అరుణమ్మ వీఓఏగా పనిచేస్తున్నారు. అరుణమ్మ మృతి విషయం తెలుసుకున్న మండల వెలుగు ఏపీఎం రామేశ్వర్, పలు గ్రామాల వీఓఏలు కర్నూలు ఆసుపత్రికి చేరుకుని సంతాపం తెలిపి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.