
ఆ రోజు ఏం జరిగిందంటే..
సరిగ్గా 16 ఏళ్ల క్రితం.. 2009 సెప్టెంబర్ 2వ తేదీన చిత్తూరు జిల్లా అనుపల్లి గ్రామంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అప్పటి సీఎం వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి బెల్ 420 హెలికాప్టర్‌లో బయలు దేరారు. కొంత సమయం తర్వాత హెలికాప్టర్ కనిపించకపోవడంతో ఆందోళన మొదలైంది. అప్పటి ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా అనుపల్లికి చేరకపోవడంతో రాష్ట్ర ప్రజలందరిలో నరాలు తెగే ఉత్కంఠ ప్రారంభమైంది. హెలికాప్టర్ ప్రమాదంలో నల్లమలలోని నల్లకాల్వ సమీపంలో ఉన్న పావురాలగుట్టలో వైఎస్సార్ మృతి చెందినట్లు సెప్టెంబర్ 3న వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రజలు తమ ఆరాధ్య నేతను గుండెల్లో దాచుకున్నారు. మహానేతను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిలో చూసుకుంటున్నారు.