చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీద్దాం | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీద్దాం

Sep 2 2025 7:36 AM | Updated on Sep 2 2025 7:36 AM

చంద్ర

చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీద్దాం

సంపద సృష్టిస్తామని రూ.2 లక్షల కోట్లు అప్పు చేశారు

కర్నూలు(టౌన్‌): అఽధికారం కోసం అబద్దాలు చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నిలదీద్దామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి పిలుపు నిచ్చారు. సోమవారం కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా జోనల్‌ సదస్సు పార్టీ జిల్లా అధ్యక్షురాలు శశికళ అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ మహిళల పక్షపాతి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అయితే మహిళా వ్యతిరేకి చంద్రబాబు అన్నారు. ఎన్నికల ముందు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చి ఏడాదిన్నర గడిచినా ఒక్కటీ అమలు చేయలేకపోయాడన్నారు. సూపర్‌ సిక్స్‌ హామీలన్నీ సూపర్‌ ఫెయిల్యూర్‌ అన్నారు. దేశంలోనే అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర పాలనలో ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్న ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు ఏడాదిన్నర కాలంలోనే రూ.2 లక్షల కోట్లు అప్పు చేశాడన్నారు. జగనన్న వల్లే మహిళా సాధికారత సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో ఆయననే ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామన్నారు. రాష్ట్రంలో 24 శాతం మద్యం అమ్మకాలు పెరగడంతోనే మహిళలపై దాడులు, అత్యాచారాలు అధికమయ్యాయన్నారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎస్వీ విజయమనోహరి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు పెట్టడం పరిపాటిగా మారిందన్నారు. జైళ్లకు పంపిస్తే భయపడే ప్రసక్తే లేదన్నారు. జగనన్న కోసం మరింత నిబద్ధతతో పనిచేస్తామన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తామని, మహిళలకు ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరిస్తామన్నారు.

ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అబద్దాలు, మోసాలు చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇచ్చిన హమీలు అమలు చేయడం లేదని తెలిసే జగనన్న ఆదేశాల మేరకు బాబు ష్యూరీటీ – మోసం గ్యారెంటీ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అందోళనలు చేపట్టామన్నారు. ప్రభుత్వం దిగి వచ్చి అరకొరగా ఒకటి, రెండు పథకాలు అమలు చేసిందన్నారు. జగనన్న హయంలో మహిళలు బంగారం కొనుగోలు చేస్తే, ఈ ప్రభుత్వంలో బంగారాన్ని అమ్ముకునే పరిస్థితులు ఉన్నాయన్నారు. శాంతి భద్రతలు క్షీణించినా హోంమంత్రి అని చోద్యం చూస్తుండటం శోచనీయమన్నారు.

మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, మాజీ సీఎం జగనన్న ఎంతో కృషి చేశారన్నారు. రాజకీయంగా 50 శాతం పదవులు మహిళలకు కేటాయించారన్నారు. ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా, ఓట్లు వేయకుండా పులివెందులలో టీడీపీ అరాచకాలు చేసి గెలుపోందడం సిగ్గుచేటన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ జగన్‌ సింగిల్‌గానే వస్తాడని, చంద్రబాబుకు ఇతర పార్టీలు ఉంటే తప్ప ఎన్నికల్లో గెలవలేడన్నారు.

వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలు శశికళ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం కన్నా అంతకు మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం నిలువునా మోసం చేసిందన్నారు. ఏడాదిలోనే టీడీపీ, జనసేన, బీజెపీ నేతల కుమ్ములాటలు పెరిగిపోయాయన్నారు. జనసేన నేతల అవినీతికి అడ్డు లేకుండా పోయిందన్నారు. నిత్యం మహిళలపై లైంగిక దాడులు చేస్తున్నా అధికార పార్టీ నేతల ఆగడాలు హోంమంత్రికి కనిపించవా అని ప్రశ్నించారు.

సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశికళా రెడ్డి, పార్టీ మాజీ జిల్లా అధ్యక్షురాలు సిట్రా సత్యనారాయణమ్మ, రీజినల్‌ అధ్యక్షురాలు గాజుల శ్వేతారెడ్డి, డిప్యూటీ మేయర్‌ సిద్దారెడ్డి రేణుక, స్టాండింగ్‌ కమిటీ సభ్యులు మునెమ్మ, రేణుకా, కల్లా నాగవేణి రెడ్డి, భారతి, మంగమ్మతో పాటు నంద్యాల జిల్లా అధ్యక్షులు ఆర్‌.సుజాతమ్మ కడప జిల్లా అధ్యక్షురాలు తెలుగుపల్లి వెంకట సుబ్బమ్మ, అనంతపురం జిల్లా అధ్యక్షురాలు బి.శ్రీదేవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగవేణి, సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు సి.నాగమణి, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ఇంటింటికి తిరిగి చంద్రబాబు

మోసాలు వివరించాలని పిలుపు

మహిళా సాధికారత

జగనన్నతోనే సాధ్యం

మహిళా జోనల్‌ సదస్సులో

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా

అధ్యక్షురాలు వరుదు కళ్యాణి

చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీద్దాం1
1/1

చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీద్దాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement