
ఐటీబీపీ కానిస్టేబుల్‌కు కన్నీటి వీడ్కోలు
బేతంచెర్ల: ఆర్‌ఎస్ రంగాపురం గ్రామానికి చెంది న ఐటీబీపీ(జీడీ) కానిస్టేబుల్ జగదల నరేంద్ర నాథ్ (32) మృతదేహా న్ని ఆదివారం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. విశాఖ పట్నం జిల్లా ఆనందపురం మండలం, పందల పాకలోని 56 బెటాలియన్ ఐటీబీపీ(జీడీ) కానిస్టేబుల్ గా పని చేస్తూ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని ఆదివారం స్వగ్రామైన ఆర్‌ఎస్ రంగాపురం గ్రామానికి చేరుకోవడంతో ఐటీబీపీ పోలీసులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నివాళులర్పించారు. అనంతరం ఐటీబీపీ పోలీసుల లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. గత కొంత కాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామానికి చెందిన సూర్యనారాయణ, లక్ష్మి దంపతుల కుమారుడు నరేంద్రనాథ్ 2014లో ఐటీబీపీ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. మృతుడికి భార్య స్వాతితో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు.

ఐటీబీపీ కానిస్టేబుల్‌కు కన్నీటి వీడ్కోలు