
బై బై గణేశా!
‘దండాలయ్యా.. ఉండ్రాలయ్యా.. నీ అండాదండా ఉండాలయ్యా’.. అంటూ బొజ్జ గణపయ్యకు ఘన వీడ్కోలు పలికారు. వినాయక చవితి సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొలువుంచిన గణేశుడి ప్రతిమలను ఐదో రోజు ఆదివారం నిమజ్జనం చేశారు. ఆదోని, కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్, నందికొట్కూరు తదితర ప్రాంతాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు చేసి నిమజ్జన శోభా యాత్ర చేపట్టారు. భక్త జనం ఉత్సాహంగానృత్యాలు చేస్తుండగా.. ఓ వైపు బాణా సంచా పేలుళ్లు.. మరో వైపు డప్పుల హోరు.. ఇంకోవైపు డీజేల ధ్వనులు హోరెత్తాయి. చెరువులు, నీటి కాల్వల్లో విగ్రహాలను నిమజ్జనం చేసి ‘వినాయకా.. వెళ్లిరావయ్యా’ అంటూ వీడ్కోలు పలికారు. – సాక్షి నెట్‌వర్క్
వెంకటాపురం చెరువులో వినాయకుడిని నిమజ్జనం చేస్తున్న దృశ్యం