మీరూ కోర్టుకు వెళ్లండి | - | Sakshi
Sakshi News home page

మీరూ కోర్టుకు వెళ్లండి

Sep 1 2025 3:07 AM | Updated on Sep 1 2025 3:07 AM

మీరూ

మీరూ కోర్టుకు వెళ్లండి

ఈ–క్రాప్‌ నమోదు చేస్తారో, లేదో!

స్థానాలను కాపాడుకునేందుకు

విశ్వప్రయత్నాలు

ఈసారి జేసీ ఆధ్వర్యంలో

బదిలీలకు అవకాశం

జిల్లాలో ముందుకు సాగని

ఈ–క్రాప్‌ నమోదు

ఇప్పటి వరకు 3.6 శాతమే పూర్తి

‘అన్నదాత సుఖీభవ’ గ్రీవెన్స్‌

పట్టించుకునే నాథుడే కరువు

కర్నూలు(అగ్రికల్చర్‌): గ్రామ వ్యవసాయ సహాయకుల(వీఏఏ) బదిలీల వ్యవహారం మళ్లీ మొదటికి రావడంతో వ్యవసాయ శాఖలో ప్రతిష్టంబన నెలకొంది. హైకోర్టు ఆదేశాలతో రీ కౌన్సెలింగ్‌ అనివార్యమైంది. ఈనేపథ్యంలో కోర్టుకు వెళ్లిన వారు మినహా మిగిలిన వీఏఏలు ఇప్పటికే కొత్త స్థానాల్లో చేరిపోయారు. బదిలీల్లో చాలా మంది వీఏఏలు పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చుకొని కీలకమైన స్థానాలు దక్కించుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీరు డబ్బు ఎలా సంపాదించుకోవాలనే విషయంపైనే దృష్టి సారిస్తూ.. విధి నిర్వహణ గాలికొదిలేసినట్లు తెలుస్తోంది. రీ కౌన్సెలింగ్‌ విషయమై వ్యవసాయ శాఖ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయని పరిస్థితి. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు వీఏఏల బదిలీలు అనివార్యమైతే జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టాలనే ఉద్దేశంతో కలెక్టర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. వీఏఏల బదిలీల వ్యవహారంలో జిల్లా పరువు గంగలో కలవడం పట్ల వ్యవసాయ శాఖపై జిల్లా కలెక్టర్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మరోసారి విమర్శలకు తావు లేకుండా జేసీకి వీఏఏల బదిలీల బాధ్యత అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే మండల వ్యవసాయాధికారులుగా నియమితులైన వారిలో 90 శాతం మంది కూటమి పార్టీల నేతలకు ముడుపులు ఇచ్చుకొనే వచ్చారనే చర్చ ఉంది. కనిష్టంగా రూ.5 లక్షల నుంచి గరిష్టంగా రూ.30 లక్షల వరకు ముడుపులు ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది. డబ్బులు ఖర్చు పెట్టుకొని స్థానాలు పొందిన వారందరూ ఇప్పుడు ఆ మొత్తాన్ని సంపాదించుకునే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ పరిస్థితి పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ముందుకు సాగని ఈ–క్రాప్‌ బుకింగ్‌

ఖరీఫ్‌ సీజన్‌ మరో 40 రోజుల్లో ముగియనున్నా ఈ–క్రాప్‌ బుకింగ్‌ ముందుకు సాగని పరిస్థితి. ఇప్పటి వరకు జిల్లాలో 3.38 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. మామూలుగా అయితే ఇప్పటికే 50–60 శాతం వరకు ఈ–క్రాప్‌ బుకింగ్‌ పూర్తి కావాల్సి ఉంది. అయితే 3.6 శాతం మాత్రమే చేయడం గమనార్హం. సగం మండలాల్లో ఈ–క్రాప్‌ బుకింగ్‌ ఊసే కరువైంది. బదిలీలు మళ్లీ మొదటికి రావడంతో పోస్టింగ్‌ ఎక్కడికి పడుతుందోనన్న ఆందోళన వీఏఏల్లో వ్యక్తమవుతోంది.

అన్నదాత సుఖీభవ గ్రీవెన్స్‌

తీసుకునేదెవరు?

అన్నదాత సుఖీభవ కింద వేలాది మందికి అన్ని అర్హతలున్నా సాయం అందలేదు. బ్యాంకు ఖాతాలకు ఎన్‌పీసీఐ లింక్‌ కాని ఖాతాలు వేలల్లో ఉన్నాయి. ఈ లిస్ట్‌లను గ్రామ రైతు సేవా కేంద్రాలకు పంపారు. వివరాలు రైతులకు చెప్పేందుకు వీఏఏలు అందుబాటులో లేని పరిస్ధితి ఏర్పడింది. ఇదే సమయంలో రైతుల నుంచి అన్నదాత సుఖీభవకు సంబంధించి గ్రీవెన్స్‌ తీసుకునే వారు కరువయ్యారు. తీసుకున్న గ్రీవెన్స్‌ను పరిశీలించి పరిష్కరించే దిక్కు లేకుండా పోయింది.

నిర్వీర్యమైన రైతు సేవా కేంద్రాలు

అన్నదాతలకు విశేష సేవలందించిన రైతుభరోసా కేంద్రాలు నేడు ఉండీ లేనట్లుగా తయారయ్యాయి. గతంలో 877 రైతు భరోసా కేంద్రాలు ఉండగా.. కూటమి ప్రభుత్వం 689కి తగ్గించింది. రేషనలైజేషన్‌ పేరిట 188 రైతు సేవా కేంద్రాలను మూసివేసింది. ఎట్టకేలకు బదిలీల ప్రక్రియ పూర్తయి పాలన గాడిన పడుతోందని భావిస్తున్న తరుణంలో హైకోర్టు వీఏఏల బదిలీలను రద్దు చేసింది. మళ్లీ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడంతో వ్యవసాయ శాఖలో ప్రతిష్టంభన నెలకొంది.

ఈ సారి పత్తి, కంది తదితర పంటలు సాగు చేశాం. గతంలో ఆగస్టు 15లోపే ఈ–క్రాప్‌లో పంటలను నమోదు చేసేవాళ్లు. ఈ సారి ఆగస్టు నెల గడుస్తున్నా ఆ ఊసే కరువైంది. ఇక్కడ పనిచేసే గ్రామ వ్యవసాయ అసిస్టెంట్‌ను బదిలీ చేశారు. ఆ స్థానంలో ఎవ్వరినీ నియమించలేదు. 2023–24 వరకు రైతులకు అన్ని రకాల సేవలు ఆర్‌బీకే ద్వారా అందాయి. ఇప్పుడు ఎలాంటి సేవలు అందించడం లేదు. ఈ–క్రాప్‌ నమోదు చేస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి.

– ఉమేష్‌, జి.హొసల్లి, ఆదోని మండలం

కోర్టుకు వెళ్లిన 40 మంది కోసం అందరినీ బదిలీ చేయాలా.. మీరూ కోర్టుకు వెల్లండి.. అని కొంతమంది అధికారులు వీఏఏలను రెచ్చగొడుతున్నట్లు సమాచారం.

హైకోర్టు ఆదేశాల మేరకు రీకౌన్సెలింగ్‌ అనివార్యం కావడంతో ముడుపులు, సిఫారసులతో అనుకూలమైన స్థానాలు దక్కించుకున్న వీఏఏలు తమ పరిస్థితి ఏంటని నాయకులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

దాదాపు 100 మందికిపైగా వీఏఏలు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ముడుపులు ఇచ్చుకొని స్థానాలు పొందారు.

ఒక వీఏఏ కోరుకున్న స్థానం కోసం

రూ.2 లక్షలు ముడుపులు

ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది.

స్థానాలు మారితే ఇచ్చిన డబ్బు తిరిగివ్వాలని కోరుతున్నట్లు చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో 40 మంది కోసం అందరినీ బదిలీ చేయడం ఏంటి, మీరు కూడా కోర్టుకు వెళ్లండని రెచ్చగొడుతున్నట్లు తెలుస్తోంది.

రేషనలైజేషన్‌ వల్ల నంద్యాల నుంచి 40 మంది వీఏఏలు కర్నూలు జిల్లాకు రావడం తప్పనిసరి.

కోర్టుకు వెళ్లిన 40 మందికి వేరే పోస్టింగ్‌ ఇచ్చినా.. మరో 40 మంది పశ్చిమ ప్రాంతంలోని సరిహద్దు మండలాలకు వెళ్లడం తప్పనిసరి.

విధి నిర్వహణలో

అంటీముట్టనట్లుగా వీఏఏలు

మీరూ కోర్టుకు వెళ్లండి1
1/2

మీరూ కోర్టుకు వెళ్లండి

మీరూ కోర్టుకు వెళ్లండి2
2/2

మీరూ కోర్టుకు వెళ్లండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement