
పెచ్చులూడి పడిన పాఠశాల పైకప్పు
● విద్యార్థులు లేకపోవడంతో
తప్పిన ప్రమాదం
కోసిగి: మండల పరిధిలోని సాతనూరు కొట్టాల గ్రామంలో ప్రాథమిక పాఠశాల పై కప్పు పెచ్చులూడి పడి పోయింది. ఆదివారం సెలవు దినం కావడంతో అందులో విద్యార్థులు లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. గ్రామ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరరగతి వరకు 35 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల చాతా కాలం క్రితం కట్టించడంతో మరమ్మతులు చేపట్టలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు పాఠశాల పైకప్పు ఉబ్బిపోయి శిథిలావస్థకు చేరింది. ఆదివారం ఓ మోస్తరు వర్షం కురుస్తుండడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో పైకప్పు పెచ్చులూడి కిందకు పడిపోయింది. గ్రామస్తులు గమనించి పాఠశాలకు వెళ్లి చూస్తే తరగతి అంతటా చెల్లాచెదురుగా పెంకులు ఊడిపడ్డాయి. పాఠశాల లేక పోవడంతో పిల్లలకు ప్రమాదం తప్పిందని గ్రా మస్తులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు స్పందించి పాఠశాలకు మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరారు.
ఆగస్టులో అధిక వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో ఆగస్టు నెల అధిక వర్షపాతం నమోదైంది. దీంతో వ్యవసాయ, ఉద్యాన పంటలకు అపారనష్టం వాటిల్లింది. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 116.2 మి.మీ. ఉండగా 208.9 మి.మీ. (80 శాతం అధికం) నమోదైంది. కర్నూలు అర్బన్, కర్నూలు రూరల్, ఆదోని, క్రిష్ణగిరి, వెల్దుర్తి తదితర మండలాల్లో అధిక వర్షాలు కురిశాయి. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు 10 మండలాల్లో వర్షాలు కురిశాయి. కల్లూరులో 12.8 మి.మీ., కర్నూలు అర్బన్‌లో 11.8, మంత్రాలయంలో 11.4, కోసిగిలో 11.2, కర్నూలు రూరల్‌లో 11.2, కౌతాళంలో 6.4 మి.మీ. ప్రకారం వర్షాలు కురిశాయి.
మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. అదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేకువ జామున పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి క్యూ లైన్లలో బారులు తీరారు. భక్తుల శివ నామ స్మరణతో శ్రీశైల ఆలయం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కిటకిటలాడుతున్నాయి.
పొలాల్లో
చిరుతపులి కూన సంచారం
డోన్ టౌన్: పంట పొలాల్లో చిరుతపులి కూన సంచరిస్తూ ఉండటం దొరపల్లె, సీసంగుంతల గ్రామస్తులను భయాందోళనలకు గురి చేసింది. ఆదివారం పొలం పనులకు వెళ్లిన వారు చిరుత కూనను చూసి వీడియో తీశారు. చిరుత పిల్లతో పాటు తల్లి చిరుత ఉంటుందని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న ఫారెస్టు బీట్ అధికారిణి భారతి దొరపల్లె, సీసంగుంతల గ్రామాలకు వెళ్లారు. చిరుత పులి కూన సంచారం విషయం తెలుసుకొని ప్రజలను అప్రమత్తం చేస్తూ దండోరా వేయించారు. పొలాలకు ఒంటరిగా వెళ్లకూడదని, నలుగురు అంతే కంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండాలని సూచించారు.
ఆన్‌లైన్‌లో రూ. 23 లక్షల మోసం
కర్నూలు(సెంట్రల్): ఆన్‌లైన్ ట్రేడింగ్ అంటూ గుర్తు తెలియని మోసగాళ్ల ఉచ్చుకు జోహరాపురం కుర్రాడు బలయ్యాడు. ఏకంగా రూ.23.70 లక్షలు పెట్టుబడి మోసం పోయాడు. కర్నూలు అర్బన్ మండల పరిధిలోని జోహరాపురానికి చెందిన శ్రావణ్‌కుమార్ అధిక వడ్డీలకు ఆశపడి ఆన్‌లైన్‌లో రూ.23.70 లక్షలు పెట్టబడి పెట్టారు. సైబర్ మోసగాళ్ల సెల్‌ఫోన్‌లు స్విచ్ఛాఫ్ కావడంతో మోసపోయానని తెలుసుకొని ఆదివారం పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమో దు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పెచ్చులూడి పడిన పాఠశాల పైకప్పు