
విద్యుత్ వైర్లు, స్టార్టర్ బాక్స్‌ల చోరీ
హొళగుంద: మండల పరిధిలోని హొన్నూరు క్యాంపునకు (తెక్కలకోట రస్తా) వెళ్లే దారిలోని పొలాల్లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దాదాపు రూ.లక్షకు పైగా విలువైన విద్యుత్ మోటర్ వైర్లు, స్టార్టర్ బాక్స్‌లు ఎత్తుకెళ్లారు. దాదాపు 30కు పైగా మోటర్లకు సంబంధించిన వైర్లను, రెండు స్టార్టర్ బాక్స్‌లను చోరీ చేశారు. విషయం తెలుసుకున్న హొళగుందకు చెందిన తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు సిందువాళ కృష్ణయ్య, రైతులు గిరిమల్ల, లక్ష్మన్న, అబ్దుల్ సుభాన్ తదితరులు చోరీ జరిగిన పొలాలను పరిశీలించారు. ఈ కేబుల్ వైర్ మీటర్ రూ.100కు పైగా ధర ఉంటుందని ఒక్కో బోరు వద్ద 20 మీటర్లకు పైగా వైర్లును కత్తిరించారని రైతులు తెలిపారు. వెంటనే దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.