కొండలరాయుడికి తేళ్లే నైవేద్యం! | - | Sakshi
Sakshi News home page

కొండలరాయుడికి తేళ్లే నైవేద్యం!

Sep 5 2023 1:58 AM | Updated on Sep 5 2023 9:02 AM

పట్టుకున్న తేళ్లను చూపుతున్న దృశ్యం - Sakshi

పట్టుకున్న తేళ్లను చూపుతున్న దృశ్యం

కోడుమూరు రూరల్‌: ఎక్కడైనా దేవుళ్లకు భక్తులు పాలు, పండ్లు, ఫలహారాలను నైవేద్యంగా పెట్టి తమ మనస్సులోని కోరికలను కోరుకుంటారు. అయితే కోడుమూరులోని కొండమీద వెలసిన కొండలరాయుడికి మాత్రం భక్తులు తేళ్లను చేతులతో పట్టుకొని స్వామివారిపై వదిలి తమ మొక్కులను తీర్చుకుంటారు.

ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే మూడో సోమవారం ఈ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా నిర్భయంగా తేళ్లను చేతులతో పట్టుకొని స్వామివారికి సమర్పించడం ఇక్కడ ప్రతి యేటా కొనసాగే ఆచారం.

తేలును పట్టుకునే సమయంలో కుట్టినా స్వామి వారి ఆలయం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తే తగ్గిపోతుందన్నది ఇక్కడి భక్తుల నమ్మకం. సోమవారం సాయంత్రం వందలాది మంది ప్రజలు కాలినడకన కొండపైకి చేరుకొని కొండలరాయుడిపై తేళ్లను వదిలి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తేళ్లను పట్టుకుంటున్న భక్తులు1
1/1

తేళ్లను పట్టుకుంటున్న భక్తులు

Advertisement
 
Advertisement
Advertisement