కరువులో రైతుల నుంచి పంటల బీమా ప్రీమియం వసూలు రెండున్నరేళ్లలో ఒక్కరూపాయి బీమా పరిహారం అందించని వైనం ఉమ్మడి కృష్ణాజిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో బీమా ప్రీమియం రూపంలో రూ.17.52 కోట్లు వసూలు కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ ఎత్తివేసి శఠగోపం పెట్టిన ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సీడీని గాలికొదిలేసిన వైనం
ప్రస్తుత ఖరీఫ్‌లో బీమా ప్రీమియం వసూలు వివరాలు
జి.కొండూరు: చంద్రబాబు ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేసింది. ఆపదలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం మొండిచేయి చూపడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. గత వైస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమాను సైతం ఎత్తివేసి బీమా ప్రీమియం భారం రైతులపైనే వేయడంతో లబోదిబోమంటున్నారు. రెండున్నరేళ్లుగా ఐదు సీజన్‌లలో బీమా ప్రీమియం చెల్లించి పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారం ఒక్కరూపాయి అందలేదు. ప్రభుత్వం అందించాల్సిన ఇన్‌పుట్ సబ్సీడీకి బ్రేక్ వేశారు. కౌలు రైతుల ప్రయోజనాలను గాలికొదిలేశారు. కరువు ఉందని తెలిసినప్పటికీ ప్రస్తుత ఖరీఫ్‌లో రైతు నుంచే బీమా ప్రీమియంను వసూలు చేయడం పట్ల ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్ధమవుతుంది.
కరువులో రైతుపైనే భారం...
ఉమ్మడి కృష్ణాజిల్లాలో కరువు తాండవ చేస్తోందని తెలిసినప్పటికీ ప్రభుత్వం ఉచిత పంటల బీమాను అమలు చేయకుండా రైతుల నుంచి బీమా ప్రీమియంను వసూలు చేయడంతో రైతులపై ఆర్ధిక భారం పడింది. ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో అన్ని అగ్రికల్చర్ పంటలు కలిపి 84,395 హెక్టార్లు, హార్టీకల్చర్ పంటలు 48 వేల హెక్టార్లలో సాగు చేశారు. వీటిలో పంటల బీమా కోసం గుర్తించిన పంటలు పత్తి 25,987 హెక్టార్లు, పెసర 6,114హెక్టార్లు, మొక్క జొన్న 3,297 హెక్టార్లు, వరి 45,591 హెక్టార్లు, మిరప 12,600 హెక్టార్లు మొత్తం కలిపి 93,589 హెక్టార్లలో సాగు చేయగా 30,174.85 హెక్టార్లకు రైతులు బీమా చేయించారు. దీనికి గానూ ప్రీమియం కింద రూ.9,63,6500 రైతులు చెల్లించారు. కృష్ణాజిల్లాలో వరి, పసుపు కలిపి 37,739 హెక్టార్లకు గానూ రూ.7, 89,13,125 బీమా ప్రీమియంగా రైతులు చెల్లించారు. ఈ విధంగా రెండు జిల్లాల్లో కలిపి రైతులపైన రూ.17.52 కోట్ల ఆర్థ్ధికభారం పడింది. చంద్రబాబు ప్రభుత్వం రెండున్నరేళ్లుగా ఉచిత పంటల బీమాను ఎత్తివేసి రైతుల నుంచి బీమా ప్రీమియం కట్టించడంతోపాటు ఈ రెండున్నర ఏళ్లలో 18సార్లు ప్రకృతి వైపరీత్యాలు వచ్చి ఉమ్మడి కృష్ణాజిల్లాలో రైతులు నష్టపోతే ఒక్క రూపాయి కూడా బీమా పరిహారం అందేలా చూడలేకపోయింది. అంతే కాకుండా బుడమేరు వరదలు వచ్చినప్పడు మినహా ఈ రెండున్నరేళ్లలో ఇన్‌పుట్ సబ్సీడీని మరిచి రైతులను వేధించింది. దీనితో పంటల బీమా మీద నమ్మకంలేక, ఆర్ధికభారంతో బీమా చెల్లింపు 40శాతానికి మించలేదు.
కౌలు రైతులకూ అన్యాయం..
ఇదిలా ఉంటే కౌలు రైతులకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 1.5లక్షల మంది వరకు కౌలు రైతులు ఉండగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కౌలు రైతుల కార్డులు మంజూరు తూతూ మంత్రంగానే చేశారు. అన్నదాత సుఖీభవ అర్ధికసాయాన్ని కౌలు రైతులకు ఎత్తివేయడంతో తీవ్రంగా నష్టపోయారు.
గత ప్రభుత్వంలో మిన్నగా పరిహారం...
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాను అందించి, పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారంతో పాటు ఇన్‌పుట్ సబ్సీడీ సైతం నష్టపోయిన సీజన్‌లోనే అందించారు. ఎన్టీఆర్ జిల్లాలో 56,156 మంది రైతులకు రూ.47.77 కోట్లు పరిహారం అందింది. అదేవిధంగా వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా గత ఐదేళ్ల పాలనలో రూ.32.84 కోట్లతో 1667 వ్యవసాయ పరికరాలు, 35 వరి కోత యంత్రాలు, 183 ట్రాక్టర్లను అందజేయగా రూ.11.83కోట్ల రాయితీని రైతులు పొందారు. చంద్రబాబు ప్రభుత్వం 2024–25 ఏడాదికి మాత్రమే జిల్లాలో 1,08,859 మంది రైతులు ఉంటే కేవలం 867 మందికి రూ.1.67 కోట్ల విలువైన వ్యవసాయ పరికరాలు, 2.74 కోట్లతో కిసాన్ డ్రోన్లను అందించి చేతులు దులుపుకుంది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎటువంటి పరికరాలను అందించలేదు.
ఎన్టీఆర్ జిల్లా..
పంట బీమా చేయించిన బీమా చేయించిన రైతులు చెల్లించిన
రైతులు భూమి హెక్టార్లలో ప్రీమియం రూ.లక్షల్లో
పత్తి 19965 10902.33 517.86
పెసర 7670 5220.76 46.99
మొక్కజొన్న 4803 3149.84 29.14
వరి 13402 5091.18 108.19
మిరప 10350 5810.74 261.48
కృష్ణాజిల్లా...
వరి 47241 36844 764.51
పసుపు 1029 895 24.61


