పెట్టుబడుల ఆకర్షణకు కార్యాచరణ రూపొందించండి | - | Sakshi
Sakshi News home page

పెట్టుబడుల ఆకర్షణకు కార్యాచరణ రూపొందించండి

Oct 13 2026 1:47 AM | Updated on Oct 13 2026 1:47 AM

పోర్టు ఆధారిత పరిశ్రమలు, ఆక్వా ప్రాసెసింగ్‌కు విస్తృత అవకాశాలు కృష్ణా కలెక్టర్‌ డీకే బాలాజీ

చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో అమరావతి ఆర్ధిక ప్రాంత అభివృద్ధి ప్రణాళిక (ఏఈఆర్టీ) రూపకల్పనపై సంబంధిత అధికారులు, జిల్లా అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీసీఆర్డీఏ నియమించిన వ్యూహాత్మక సహాయ సంస్థ ఎల్‌ఈఏ అసోసియేట్స్‌ సౌత్‌ ఆసియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రిన్సిపల్‌ కన్సల్టెంట్‌ స్మిత జె.కుట్టికాట్‌, జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. స్మిత జె.కుట్టికాట్‌ ప్రణాళిక లక్ష్యాలు, అధ్యయన విధానాన్ని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. జిల్లాలో ఇప్పటికే బలంగా ఉన్న రంగాలతో పాటు కొత్తగా అభివృద్ధి చేయగల రంగాలను గుర్తించి వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సహకారం, పెట్టుబడుల సమీకరణ మార్గాలను ప్రతిపాదించాలని ఆమె సూచించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మచిలీపట్నం పోర్టు కేంద్రంగా పోర్టు ఆధారిత పరిశ్రమలు, ఆహార శుద్ధి యూనిట్లు, శీతల గిడ్డంగులు, ఎగుమతి ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు. రహదారులు, రైల్వే, జల రవాణా వ్యవస్థలను సమన్వయం చేయటం ద్వారా సరుకు రవాణా సులభతరం చేసి పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు అవసరమైన చర్యలను ప్రణాళికలో పొందుపరచాలని కోరారు. సమావేశంలో వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు జ్యోతిరమణి, జె.జ్యోతి, జిల్లా గణాంకశాఖ ఏడీ కె.పద్మజ, డెప్యూటీ అర్ధగణాంకాధికారి ఆనంద్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ లోకేశ్వరరావు, జిల్లా పర్యాటక అధికారి జి. రామలక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement