విభిన్న ప్రతిభావంతుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ | - | Sakshi
Sakshi News home page

విభిన్న ప్రతిభావంతుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ

Oct 13 2026 1:47 AM | Updated on Oct 13 2026 1:47 AM

చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల కోసం గుర్తించిన బ్యాక్‌లాగ్‌ పోస్టులను సోమవారం భర్తీ చేసి నియామక పత్రాలు అందజేశారు. వికలాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో క్లాస్‌–4 విభాగంలో 21 పోస్టులు, గ్రూప్‌–4 విభాగంలో 12 పోస్టులు మొత్తం 33 పోస్టులకు సంబంధించి నియామకపత్రాలను కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో కలెక్టర్‌ డీకే బాలాజీ చేతుల మీదుగా నియామకపత్రాలు అందజేశారు. వీరికి వివిధ శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమశాఖ ఏడీ వి కామరాజు, కలెక్టరేట్‌ ఏవో ఏఎస్‌ఎన్‌ రాధిక తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement