షార్ట్‌టర్మ్‌ కోర్సులు యూనివర్సిటీ స్థాయిలో ప్రవేశ పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌టర్మ్‌ కోర్సులు యూనివర్సిటీ స్థాయిలో ప్రవేశ పెట్టాలి

Oct 7 2026 2:16 AM | Updated on Oct 7 2026 2:16 AM

పామర్రు: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం కూచిపూడి శ్రీ సిద్దేంద్ర యోగి నాట్య కళా పీఠంలో షార్టు టర్మ్‌ కోర్సులను , రీసెర్చ్‌, సమ్మర్‌ కోర్సులను పరిచయం చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ ఆకాంక్షించారు. కూచిపూడిలో రెండు రోజులపాటు జరిగే జాతీయ వర్క్‌ షాపులో బాగంగా తొలిరోజు మంగళవారం మధ్యాహ్నం నాట్యాచార్యులతో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కూచిపూడి పర్యాటకంగా అనుసంధానం చేసి అభివృద్ధి పరచాలని ఆకాంక్షించారు. ఎక్కువ కోర్సులను యూనివర్సిటీ స్థాయిలో పరిచయం చేయాలని, కూచిపూడి అంటే తెలుగు వారి సంప్రదాయ కళగా గుర్తింపు పొందే విధంగా తీర్చి దిద్దాలని అభిప్రాయ పడ్డారు. కూచిపూడి నాట్యానికి యునెస్కో గుర్తింపు తీసుకురావాలన్న ఆశయం సఫలీ కృతం చేసుకుందామని అన్నారు. సీసీఆర్‌ ఫండ్స్‌ ద్వారా, ఇండస్ట్రీస్‌ నుంచి విరాళాలు సేకరించి కూచిపూడి కళా క్షేత్రంలో పక్కా ఆడిటోరియం నిర్మించే యోచన ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా కూచిపూడి నృత్యంపై రవి బాలకృష్ణ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి మాతెలుగు తల్లికి మల్లెపూదండ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో అతిథులను కళాపీఠం తరపున సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్‌ రాజా, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సమ్రత అగర్వాల్‌, ఓఎస్‌డి ఆచార్య వి నిరీక్షణ బాబు, ఐఓసీ విశ్రాంత జనరల్‌ మేనేజర్‌ పసుమర్తి ఉదయ్‌భాస్కర్‌, టూరిజం డైరెక్టర్‌ ప్రసన్న లక్ష్మీ, యున్‌ విజన్‌ డిప్లమోటిక్‌ ఛీప్‌ ఎక్సఫర్టు జయరాములు లింగుట్ల, విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య డి.మునిరత్నం నాయుడు, రిజిస్టార్‌ డాక్టర్‌ ఎం శ్రీనివాసరావు, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌చింతా రవి బాలకృష్ణ, పసుమర్తి ఉదయ్‌ భాస్కర్‌, డాక్టర్‌ వేదాంతం రామలింగ శాస్త్రి, డాక్టర్‌తాడేపల్లి, గ్రంథాలయ పాలకులు వైవి ఫణికుమార్‌ పాల్గొన్నారు.

కృష్ణా కలెక్టర్‌ డీకే బాలాజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement