పెట్టింది తిను | - | Sakshi
Sakshi News home page

పెట్టింది తిను

Oct 7 2026 2:16 AM | Updated on Oct 7 2026 2:16 AM

బుధవారం శ్రీ 7 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 u8లో అడగొద్దు మెనూ.. పెట్టింది తిను అర్ధాకలితో రోగులు విలవిల లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆస్పత్రికి వచ్చిన రోగులకు మందులతో పాటు పోషకాహారం అందితే జబ్బు త్వరగా నయమవుతుంది. అయితే విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్‌)లో పంపిణీ చేస్తున్న భోజనం అంటేనే రోగులు బెంబేలెత్తుతున్నారు. మెనూ పాటించకుండా, నాసిరకంగా ఉన్న ఆహారాన్ని తినలేక అర్ధాకలితో అల్లాడుతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందే రోగులకు ప్రభుత్వమే భోజనం సరఫరా చేస్తోంది. అందు కోసం ప్రతి రోగికి రోజుకు రూ.80, గర్భిణులకు రూ.100 చొప్పున చెల్లిస్తోంది. అయితే జీజీహెచ్‌ డైట్‌ కాంట్రా క్టర్‌ పంపిణీ చేస్తున్న భోజనం నాసిరకంగా ఉండి మింగుడు పడటం లేదని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజనం తినలేక అర్ధాకలితోనే ఉంటున్నారు. నాణ్యమైన భోజనం పెట్టాలని అధికారులు సూచించినా డైట్‌ కాంట్రాక్టరు తీరులో మాత్రం మార్పు రావడం లేదు. చాలా మంది రోగులకు ఇంటి నుంచి ఆహారం తీసుకు రావాల్సి వస్తోందని వారి సహాయకులు పేర్కొంటున్నారు. ఆహారం ఇలా.. కోలుకునేది ఎలా? అన్నం గట్టిగా ఉండటంతో రోగులు తినలేకపోతు న్నారు. కొందరు అరటిపండు, గుడ్డు తిని సరిపెడు తున్నామని, మజ్జిగ తాగితే నీళ్లు తాగినట్లే ఉందని పేర్కొంటున్నారు. టీబీ ఇన్‌ఫెక్షన్‌ రోగులకు, గర్భిణులక పోషకాహారం అందించాల్సి ఉంది. అయితే డైట్‌ కాంట్రాక్టర్‌ పాటించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. వారికి అదనంగా పళ్లు, వేరుశనగ చిక్కీ అందించాల్సి ఉంది. అయితే రోజూ పంపిణీ చేయడంలేదని రోగులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం పెట్టే భోజనమే ఇలా నాసిరకంగా ఉంటే, ఇక రోగులు ఎలా కోలుకుంటారనే ప్రశ్న ఎదురవుతోంది. పంపిణీలోనూ వివక్ష భోజనాన్ని ఒక ట్రాలీలో వార్డులకు తీసుకెళ్లి రోగులకు అందించాల్సి ఉంది. అయితే ఫ్లోర్‌లో ఒకచోట ట్రాలీ నిలిపి అక్కడే అందరికీ భోజనం వడ్డిస్తున్నారు. దీంతో వార్డుల నుంచి రోగుల అటెండెంట్‌లు ప్లేట్లు పట్టుకుని వేచి చూడాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంటోంది. అక్కడ పరిస్థితి చూస్తే, ఉచితంగా అన్నదానం చేస్తుంటే క్యూలో వెళ్లి తీసుకున్న చందంగా మారిపోయింది. అంతేకాదు కొన్ని వార్డుల్లో ప్లేట్లు పట్టుకుని డైట్‌ కోసం క్యూలో ఎదురు చూస్తూ కనిపించారు. అంటే రోగులకు భోజనం పెట్టేందుకు కూడా అంత దయనీయ స్థితికి దిగజార్చారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్‌రీల్‌

మజ్జిగ నీళ్లులా ఉన్నాయి

నా భర్తకు అనారోగ్యం చేస్తే నాలుగు రోజుల కిందట ఇక్కడ చేర్చాం. ఇక్కడ పెట్టే అన్నం తినలేక పోతున్నాడు. కనీసం మజ్జిగ అయినా తాగిద్దాం అంటే నీళ్లులా ఉన్నాయి. ఇంకా ఎలా ఆకలి తీరుతుంది? బయటకు వెళ్లి ఇడ్లీ కొని తినిపిస్తున్నాం. పాలు, రొట్టె ఇస్తారని చూస్తున్నాం కానీ ఇవ్వడం లేదు. బయట తెచ్చుకుంటున్నాం.

రైస్‌, పప్పు మార్చాలని చెప్పాం

రోగులకు పెట్టే ముందే రోజూ డైట్‌ను పరిశీలిస్తుంటాం. రైస్‌, పప్పు నాసిరకంగా ఉందని మార్చాలని డైట్‌ కాంట్రాక్టర్‌ను ఆదేశించాం. మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించాం. రోగులకు నాణ్యమైన భోజనం అందించాలని స్పష్టంచేశాం. మా ఆదేశాలు పాటించకపోతే, తదుపరి చర్యలు తీసుకుంటాం.

నాసిరకం బియ్యం.. ఉడకని అన్నం

విద్యతోపాటు కమ్యూనికేషన్స్‌ ప్రధానం

వైద్య సేవలకు సమ్మె సెగ!

స్టడీ మెటీరియల్‌ పంపిణీ

కృష్ణాజిల్లా
బుధవారం శ్రీ 7 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026
u8లో
అడగొద్దు మెనూ..

7

– మాణిక్యం, పెనుగంచిప్రోలు

విజయవాడ జీజీహెచ్‌లో

రోగులకు నాసిరకం ఆహారం

అన్నం తినలేని విధంగా

ఉంటోందంటున్న రోగులు

ఉడకని పప్పు,

నీళ్లను తలపించేలా మజ్జిగ పంపిణీ

అధికారులు హెచ్చరించినా

తీరు మార్చుకోని కాంట్రాక్టర్‌!

– డాక్టర్‌ వై.పద్మావతి,

సివిల్‌సర్జన్‌ ఆర్‌ఎంఓ, జీజీహెచ్‌

విద్యార్థులు ఉద్యోగం సాధించాలంటే స్కిల్స్‌, కమ్యూనికేషన్స్‌ పెంపొందించుకోవాలని కృష్ణా విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కూన రాంజీ సూచించారు.

ఉమ్మడి కృష్ణాలో కాంట్రాక్టు వైద్య ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. దాదాపు 1400 మంది వేర్వేరు క్యాడర్‌ ఉద్యోగులు అత్యవసరం మినహా అన్ని సేవలను బహిష్కరించారు.

ఎన్టీఆర్‌ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలో ప్రతిభ చాటేలా మంగళవారం ఉచిత స్టడీ మెటీరియల్‌ను పంపిణీచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement