కోడూరు: పార్కింగ్‌లో పెట్టిన కారులోమంటలు చెలరేగి కారు దగ్ధం అయిన ఘటన కోడూరులో సోమవారం చోటు చేసుకుంది. కోడూరుకు చెందిన షేక్ కరిముల్లా తన కారును రామకృష్ణా థియెటర్‌కు చెందిన ఖాళీ ప్రదేశంలో పెట్టారు. ఉదయం 10 గంటల సమయంలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు మొత్తం అగ్నికి అహుతైంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా, అవనిగడ్డ ఫైర్ అధికారులు వచ్చి మంటలు అదుపు చేశారు. ఘటనాస్థలాన్ని కోడూరు ఎస్‌ఐ చాణిక్య పరిశీలించి, వివరాలు సేకరించారు. కారుకు ఎవరైనా నిప్పుపెట్టారా, లేక కారు లోపల నుంచి మంటలు వ్యాపించాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.


