కూటమి కుట్రలు బట్టబయలు | - | Sakshi
Sakshi News home page

కూటమి కుట్రలు బట్టబయలు

Feb 1 2026 7:26 AM | Updated on Feb 1 2026 7:26 AM

కూటమి కుట్రలు బట్టబయలు

కూటమి కుట్రలు బట్టబయలు

● పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం మంటాడ గ్రామంలో ఉన్న వెంకటేశ్వరస్వామి దేవాలయంలో మాజీ శాసనసభ్యుడు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కై లే అనిల్‌కుమార్‌ నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి తీర్ధప్రసాదాలు స్వీకరించిన అనంతరం ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జొన్నల రామ్మోహన్‌రెడ్డి, కూనపరెడ్డి స్వరూపరాణి, శొంఠి వెంకటేశ్వరరావు, తిరుమలశెట్టి బోసుబాబు, పి.వంశీకృష్ణ, మేరుగ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ● మచిలీపట్నం నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) ఆధ్వర్యంలో నగరంలోని బచ్చుపేట శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం వరకు ర్యాలీగా తరలివెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ ముఖద్వారం వద్ద పార్టీ నాయకులు కొబ్బరికాయలు కొట్టారు. కార్యక్రమంలో కార్పొరేషన్‌ మేయర్‌ చిటికిన వెంకటేశ్వరమ్మ, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ షేక్‌ సలార్‌దాదా, నగర పార్టీ అధ్యక్షుడు మేకల సుధాకర్‌బాబు (సుబ్బన్న), మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ షేక్‌అచ్చెబా, పార్టీ నాయకులు శీలం మారుతీరావు (బాబ్జి), మట్టా మోహన నాంచారయ్య, గణేశన రమేష్‌ పలువురు కార్పొరేటర్లు, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ● పెడన నియోజకవర్గం పెడన పట్టణంలోని 11వ వార్డు శ్రీ అలివేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఉప్పాల రాము నేతృత్వంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు మైలా రత్నకుమారి, వేముల సురేష్‌బాబు, ఎంపీపీ సంగా మధుసూదనరావు, మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ ఎండీ ఖాజా, గళ్లా భూపతి, పార్టీ నాయకులు కటకం ప్రసాద్‌, ముత్యాల నాగేశ్వరరావు, తిరుమాని శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ● పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు విష్ణు ఆలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దేవభక్తుని చక్రవర్తి నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బాకీ బాబు, రమాదేవి, మాదు శ్రీహరిరాణి, భీమవరపు నాగిరెడ్డి, ప్రతివాడ రాఘవరావు, పిడికిటి రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ● గుడివాడ నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మెరుగుమాల కాళి, ఎస్సీ సెల్‌ నాయకులు మట్టా జాన్‌విక్టర్‌బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిపై చేసిన విష ప్రచారం వెనుక కుట్రను సిట్‌ ఇచ్చిన రిపోర్టు బట్టబయలు చేసిందన్నారు.

తిరుమల లడ్డూ కల్తీ కాలేదని సుప్రీం కోర్టులో సిట్‌ చార్జిషీట్‌

కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు కూటమి నాయకులకు సద్బుద్ధి ప్రసాదించాలని వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జిల్లాలో ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు

చిలకలపూడి(మచిలీపట్నం): తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని కూటమి నాయకులు విష ప్రచారం చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని పలువురు వైఎస్సార్‌ సీపీ నాయకులు అన్నారు. పంది, చేప కొవ్వు కలవలేదని సీబీఐ దర్యాప్తులో సంచలన నిజాలు వెల్లడైన నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యలో పార్టీ అధినాయకత్వం పిలుపుమేరకు నియోజకవర్గ కేంద్రాల్లోని వేంకటేశ్వరస్వామి దేవాలయాల్లో శనివారం పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు చేసి కొబ్బరికాయలు కొట్టి కూటమి నాయకులు చేసిన విష ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఐసీఏఆర్‌, ఎన్‌డీడీపీ ల్యాబ్‌లలో పరీక్షలు చేయటంతో పాటు శాసీ్త్రయంగా శోధించి సాధికారికంగా సీబీఐ నిర్ధారణ చేయటంతో కూటమి నాయకులు చేసిన విష ప్రచారానికి తెరపడిందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై బురద జల్లేందుకు చంద్రబాబు చేసిన కుట్రలు, వాటికి పవన్‌కళ్యాణ్‌ వత్తాసు అంతా ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చేసిన రాజకీయ హైడ్రామా అని తేటతెల్లమైందన్నారు.

కూటమి కుయుక్తులన్నీ సుప్రీంకోర్టులో సిట్‌ చార్జిషీట్‌తో బట్టబయలు అయ్యాయి. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విషప్రచారం చేయడంతో గోబెల్‌ను మించిపోయిన చంద్రబాబు, పచ్చకూటమి గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టయింది. ప్రతిపక్షాన్ని దెబ్బ తీయడానికి దేవుడిని కూడా వాడుకునే స్థితికి రాజకీయాల్ని దిగజార్చారంటూ సామాన్య భక్తులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు శనివారం ప్రత్యేక పూజలు చేసి కూటమి నాయకులకు ఇకనైనా సద్బుద్ధి కలిగేలా చూడాలని ఆ దేవదేవుని ప్రార్థించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement