నా దేశం.. నా ఓటు ప్రతిజ్ఞ
చిలకలపూడి(మచిలీపట్నం): జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లోని సమావేశంహాలులో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ నా దేశం – నా ఓటు ప్రతిజ్ఞను చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జనవరి 25న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారన్నారు. ముఖ్యంగా యువతను ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం ప్రధాన ఉద్దేశమన్నారు. దీని కోసం నా దేశం.. నా ఓటు నినాదంతో ఎన్నికల్లో ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలనే స్పృహను కల్పించేందుకే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, డీఆర్వో కె. చంద్రశేఖరరావు, గుడివాడ ఆర్డీవో జి.బాలసుబ్రహ్మణ్యం, కలెక్టరేట్ ఏవో ఏఎస్‌ఎన్ రాధిక తదితరులు పాల్గొన్నారు.


