జిల్లా మరింత అభివృద్ధి సాధించాలి | - | Sakshi
Sakshi News home page

జిల్లా మరింత అభివృద్ధి సాధించాలి

Jan 2 2026 12:23 PM | Updated on Jan 2 2026 12:23 PM

జిల్లా మరింత అభివృద్ధి సాధించాలి

జిల్లా మరింత అభివృద్ధి సాధించాలి

జిల్లా మరింత అభివృద్ధి సాధించాలి

చిలకలపూడి(మచిలీపట్నం):నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ 2026 లో కృష్ణా జిల్లా మరింత అభివృద్ధి చెందాలని కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. గురువారం ఉదయం ఆయన క్యాంపు కార్యాలయంలో వివిధ ప్రభుత్వశాఖల అధికారులు ఆయనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం అన్ని రంగాల్లో జిల్లాను ముందంజలో ఉండే విధంగా అధికారులు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, కెఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్‌ శ్రీదేవి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement