
సంగీతంలో నిస్వార్థ సేవకే గిన్నిస్ రికార్డ్
పటమట(విజయవాడతూర్పు): వాయిద్యకారులను అనేక మందిని తయారు చేయాలనే లక్ష్యంతో హల్లెల్ మ్యూజిక్ స్కూల్‌ను ప్రారంభించినట్లు ఎషువ బెత్ హాలెల్ మినిస్ట్రీస్ ఫౌండర్ దండింగి అగస్టిన్ తెలిపారు. క్రీస్తు సంగీతంలో నిస్వార్థ సేవ చేసినందుకుఏ గిన్నిస్ రికార్డు వచ్చిందన్నారు. శుక్రవారం విజయవాడ ఏలూరు రోడ్‌లోని గుణదల మెట్రోపాలిటన్ చర్చిలో సంగీతంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన సందర్భంగా సంగీతంలో ప్రావీణ్యం సాధించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందించారు. అనంతరం దండింగి అగస్టిన్ మాట్లాడుతూ దాదాపు 18 దేశాల్లో ఉన్న 7,500 మంది విద్యార్థులకు ఉచితంగా సంగీత విద్యను నేర్పించామన్నారు. ఏడేళ్ల నుంచి 80 సంవత్సరాల వయస్సు ఉన్నవారు ఎవరైనా నేర్చుకోవచ్చని తెలిపారు. ఈ కోర్స్ పూర్తిగా ఉచితమని, ఎటువంటి ఫీజు లేదన్నారు. గిన్నిస్ రికార్డు కోసం రెండేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నామని, మూడో యత్నంగా వచ్చిందన్నారు. తన సేవలను గుర్తించి ఇంజినియస్ చాం వరల్డ్ రికార్డు గోల్డెన్ ఐకానిక్ అవార్డును తనకు ప్రత్యేకంగా ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో అగస్టిన్ కుటుంబ సభ్యులతో పాటు హాలెల్ మ్యూజిక్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎషువ బెత్ హాలెల్ మినిస్ట్రీస్
ఫౌండర్ అగస్టిన్