‘డిమాండ్లు నెరవేర్చే వరకు నిరసన’ | - | Sakshi
Sakshi News home page

‘డిమాండ్లు నెరవేర్చే వరకు నిరసన’

Oct 14 2026 4:23 AM | Updated on Oct 14 2026 4:23 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: తమ డిమాండ్లు నెరవేర్చే వరకు నిరసనలు కొనసాగిస్తామని నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. ఆర్‌బీఎస్‌కే మెడికల్‌ అధికారులు కౌటిల్య, నరేందర్‌రెడ్డి, ఎంఎల్‌హెచ్‌పీ వైద్యురాలు కీర్తన మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు వేతనాల పెంపు, బకాయిల చెల్లింపు, ఆరోగ్యబీమా వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. స్టేట్‌ హెల్త్‌ సొసైటీ పరిధిలోకి తీసుకువచ్చి స్పార్ష్‌ విధానంతో ప్రతినెలా 5న వేతనాలు చెల్లించాలన్నారు. 2022 నుంచి 5శాతం ఇంక్రిమెంట్‌తో పాటు 8శాతం బోనస్‌ మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవుల విషయంలో న్యా యం చేయాలన్నారు. మరణించిన ఉద్యోగులకు టుంబాలకు రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియా అందించా లని డిమాండ్‌ చేశారు. డీడీఎం శ్రీకాంత్‌, జిల్లా ఎపిడమాలజిస్ట్‌ ప్రశాంత్‌, క్వాలిటీ మేనేజర్‌ సాయి ప్రసాద్‌, ఏఎన్‌ఎంలు అనిత, సంతోషి, జిల్లా అకౌంట్స్‌ మేనేజర్‌ ప్రవీణ్‌, డాటా ఎంట్రీ ఆపరేటర్‌ షకీల్‌, డీపీవో వెంకటేశ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement