సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా కార్మికుల పెదవి విరుపు ఒక్క శాతం పెరిగినా లాభమయ్యేదని ఆవేదన
(మిలియన్ టన్నులు) (రూ. కోట్లు) (రూ. కోట్లు) శాతం
శ్రీరాంపూర్: సింగరేణి లాభాల్లో కార్మికుల వాటా మరోసారి 34శాతమే ప్రకటించారు. 2024–25లో చెల్లించిన విధంగానే 2025–26 ఆర్థిక సంవత్సరంలోనూ చెల్లిస్తుండడంపై పెదవి విరుస్తున్నారు. మంగళవారం ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సింగరేణి సమస్యలపై మాట్లాడారు. కార్మికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లాభాల వాటాపై ప్రకటన చేశారు. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ సాధించిన రూ.1754కోట్ల లాభాల నుంచి 34శాతం వాటా కింద రూ.596.36కోట్లు కార్మికులకు పంపిణీ చేయనున్నారు. ఈ లెక్కన ఒక్కో కార్మికునికి సగటున రూ.1,53,912 రానున్నట్లు తెలుస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో కార్మికులకు సగటున రూ.2లక్షల వరకు వచ్చాయి. దీంతో పోల్చితే ఈసారి వాటా మొత్తం రూ.50వేల వరకు తగ్గుతుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఒక్క శాతం వాటా పెరిగినా పెరిగేదని అంటున్నారు. కంపెనీలో 38,737 మంది శాశ్వత, 29715మంది కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా అందనుంది. ప్రస్తుతం మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోని బెల్లంపల్లి ఏరియాలో 856, మందమర్రి ఏరియాలో 4,308, శ్రీరాంపూర్ ఏరియాలో 7,991మంది శాశ్వత కార్మికులు ఉన్నారు. వీ రితోపాటు 2025–26 ఆర్థిక సంవత్సరంలో మధ్యలో దిగిపోయిన వారూ వా టా లబ్ధి పొందనున్నారు. ఈ మూడు ఏరి యాల్లో సుమా రు 5,800 మంది కాంట్రాక్ట్ కా ర్మికులు పని చేస్తున్నారు. కాగా, శాశ్వత కార్మికులకు లాభాల వాటా చెల్లింపులో మస్టర్లు, వ్యక్తిగత పనితీరు, గ్రూపు పనితీరు లెక్కగడుతారు. ఈసారి వాస్తవ లాభాలు రూ.2,600 కోట్లు వచ్చాయని, టాక్స్లు పోను మిగిలినవి నికర లాభాల కింద చూపినట్లు సమాచారం.
కాంట్రాక్ట్ కార్మికులకు నిరాశే..
కాంట్రాక్ట్ కార్మికులకు గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రూ.5,500 చొప్పున లాభాల బోనస్ ప్రకటించారు. ఈసారి 10శాతం వాటా ఇవ్వాలని లేదా కనీసం రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసినా ఫలితం లేకపోయింది
గత పదేళ్లుగా లాభాల వివరాలు..
సంవత్సరం సాధించిన ఉత్పత్తి నికర లాభం పంచిన వాటా వాటా
2016–17 61.34 395 99 25
2017–18 62.01 1212 327 27
2018–19 64.40 1765 494 28
2019–20 64.02 993 278 28
2020–21 50.58 272.64 79.07 29
2021–22 65.02 1227 368 30
2022–23 67.14 2222 711 32
2023–24 70.02 2412 796 33
2024–25 69.01 2360 819 34
2025–26 58.00 1754 596.36 34


