కాగజ్నగర్టౌన్: జిల్లాలోని ఆరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఐహెచ్ఎఫ్ఎంఎస్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కాగజ్నగర్ సీహెచ్సీలోని డీసీహెచ్ఎస్ విజయ్కు మంగళవారం వినతిపత్రం అందించారు. ఆ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బోగే ఉపేందర్ మాట్లాడుతూ సిర్పూర్(టి), బెజ్జూర్, వాంకి డి, తిర్యాణి, జైనూర్, కాగజ్నగర్ ఏరియా ఆస్పత్రుల్లో సుమారు వందమంది శానిటేష న్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది తక్కువ వేతనంతో విధులు నిర్వహిస్తున్నారని తెలిపా రు. ఏడు రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే విధుల బహిష్కరించి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని, దసరా బోనస్ ఇవ్వాలని, పెండింగ్ ఈపీఎఫ్, ఈఎస్ఐ బకాయిలు క్లియర్ చేసి కార్డులు అందజేయాలని కోరారు. అలా గే కాగజ్నగర్ ఏరియా ఆస్పత్రిలోని స్టాఫ్ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.


