ప్రకృతిలో లభించే పూలను పేర్చి దేవతగా పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయ ఆవరణలో మంగళవారం జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ అనంతలక్ష్మి, ఎస్పీ నితిక పంత్, డీఎఫ్వో బాలామణితో కలిసి బతుకమ్మ ఆడారు. కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన సంస్కృతి వైభవాన్ని అందిస్తుందన్నారు. మనిషి జీవితం ప్రకృతితో మమేకమై ఉంటుందని ఈ వేడుక చెబుతుందన్నారు. కార్యక్రమంలో మహిళా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. – ఆసిఫాబాద్అర్బన్


