హోరాహోరీగా రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు గిరి క్రీడాకారుల అద్భుత ప్రదర్శన ద్వితీయస్థానంలో ములుగు జట్టు
ఆసిఫాబాద్‌రూరల్: రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌గా కుమురం భీం జిల్లా కై వసం చేసుకుంది. జిల్లాకేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా మైదానంలో ఆదివారం జరిగిన అథ్లెటిక్స్ అసోసియేషన్ చాంపియన్ షిప్ రాష్ట్రస్థాయి పోటీలు హోరాహోరీగా జరిగాయి. 33 జిల్లాల నుంచి 1500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కలెక్టర్ హరిత, ఎస్పీ నితికా పంత్, ఉట్నూర్ ఐటీడీఏ పీవో మంద మకరందు.. అంతకుముందు ఈ పోటీలను ప్రారంభించారు. హోరాహోరీ పోటీల్లో కుమురం భీం జిల్లా 4 గోల్డ్ మోడల్, 2 సిల్వర్, 6 బ్రాంచ్ మోడల్‌తో ఓవరల్ చాంపియన్‌ను కై వసం చేసుకుంది. ద్వితీయస్థానంలో ములుగు జిల్లా నిలిచింది. ఈ సందర్భంగా ఎంపీ, కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. జాతీయ స్థాయిలో జిల్లా పేరును ఉంచాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, జిల్లా అధ్యక్షుడు విజయ్, లక్ష్మణ్, కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షరాలు సుగణ, బీజేపీ అధ్యక్షుడు శ్రీశైలం, మల్లికార్జున్, ఏసీఎంవో ఉద్దవ్, డీఎస్‌వో షేకు, నోడల్ ఆఫీసర్ మీనారెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి, అథ్లెటిక్స్ కోచ్ విద్యా సాగర్, అరవింద్, పీడీ, పీఈటీ సాంకేతిక సిబ్బంది 200 మంది పాల్గొన్నారు.
అండర్–10 బాలికల విభాగంలో: శ్రీవల్లి (మేడ్చల్), అనుశ్రీ(మేడ్చల్), మేఘన (జోగులాంబ), శ్రీవల్లిక (మేడ్చేల్) లాంగ్ జంప్‌లో యశాషివీ (సిద్దిపేట), కళ్యాణి (కుమురం భీం), అండర్–12 విభాగంలో నూరింన్ (కరీంనగర్), పార్వతి (నారాయణ పేట్), శైలు (జోగులాంబ), లాసియా (మహబూబాద్), లాంగ్ జంప్‌లో భవిత (ఖమ్మం), అధ్య (మేడ్చల్), జావిలిన్ త్రోలో అభిజ్ఞ (పెద్దపెల్లి), శంకరమ్మ (కుమురం భీం).
అండర్ 14 విభాగంలో: సుశీల (హైదరాబాద్), వర్ష (హైదరాబాద్), శ్రీనిధి (మంచిర్యాల), నందిని (హైదరాబాద్), లాంగ్ జంప్‌లో ప్రవళిక (కుమురం భీం), అక్షర (ములుగు), జావిలిన్ తోలో శృతి (మంచిర్యాల), సోని (హన్మకొండ), ట్రాయత్లాన్ యువరాజ్ (నాగర్‌కర్నూల్) వరుణ్ (హన్మకొండ) ప్రథమ, ద్వితీయ బహుమతులు కై వసం చేసుకున్నారు.


