గఢ్‌పూర్‌లో ఫారెస్టు మారథాన్‌ | - | Sakshi
Sakshi News home page

గఢ్‌పూర్‌లో ఫారెస్టు మారథాన్‌

Oct 12 2026 3:55 AM | Updated on Oct 12 2026 3:55 AM

● ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ● పాల్గొన్న ఔత్సాహికులు

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): అడవుల రక్షణ, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పనతోపాటు పర్యాటక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు మంచిర్యాల జిల్లాలో తొలిసారిగా ఫారెస్టు మారథాన్‌ నిర్వహించారు. హాజీపూర్‌ మండలం గఢ్‌పూర్‌ క్వారీలోని జంగిల్‌ సఫారీలో అటవీశాఖ, గ్రీన్‌న్‌ సెక్యూర్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన ఫారెస్టు మారథాన్‌ను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రస్థాయిలో మొదటిసారి జిల్లాలో మారథాన్‌ నిర్వహించడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందని చెప్పారు. జర్మన్‌, ఆస్ట్రేలియా దేశాల నుంచి, తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి 310 మంది ఔత్సాహికులు ఉత్సాహంగా 5, 10, 30 కేఎం విభాగాల్లో పాల్గొన్నారు. ఉట్నూర్‌ ఐటీడీఏ పీవో మంద మకరందు, సీఎఫ్‌డీపీటీ శాంతారాం, డీఎఫ్‌ఓ రాహుల్‌కిషన్‌ జాదవ్‌, ఎఫ్‌డీఓ సర్వేశ్వర్‌, లక్సెట్టిపేట ఎఫ్‌ఆర్వో సంతోశ్‌, గ్రీన్‌ సెక్యూర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ పాలూరి ఆదిత్య, రేస్‌ డైరైక్టర్‌ హరినాథ్‌ పాల్గొని మారథాన్‌ పూర్తి చేసినవారికి పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. 15 నుంచి 60 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఉత్సాహంగా పాల్గొనడంతో పలువురిలో ఆలోచన, స్ఫూర్తి నింపింది. జర్మనీకి చెందిన రూడ్‌ గ్రిమ్‌, 52 ఏళ్ల వయస్సులో ఉన్న డాక్టర్‌ మన్విమెహతా మారథాన్‌ ని ర్వాహకులను అభినందిస్తూ సఫారీలో ఏర్పాటు అద్భుతంగా ఉన్నాయన్నారు. మంచిర్యాల ఎఫ్‌ఎస్‌ ఓ శ్రీలత, బీట్‌ అధికారి రాజేందర్‌, జిల్లాలోని పలు సెక్షన్లు అటవీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement