వెయ్యి కిలోమీటర్ల మైలురాయి పూర్తి | - | Sakshi
Sakshi News home page

వెయ్యి కిలోమీటర్ల మైలురాయి పూర్తి

Oct 12 2026 3:55 AM | Updated on Oct 12 2026 3:55 AM

● మంచిర్యాలకు చెందిన సందేశ్‌గుప్తా

మందమర్రి వాసికి మహాత్మా గాంధీ నేషనల్‌ పీస్‌ అవార్డు

మందమర్రిరూరల్‌: పట్టణంలోని ప్రాణహిత కాలనీ (షిర్కే) కు చెందిన మట్టె రవీందర్‌కు గ్లోబల్‌ హెల్ప్‌ ఫౌండేషన్‌ నిర్వహకులు మహా త్మాగాంధీ నేషనల్‌ పీస్‌ అవార్డు 2026 అందజేశారు. ఆదివారం మార్కపూర్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవీందర్‌కు అవార్డు అందజేస్తూ శాలువా కప్పి నిర్వాహకులు సన్మానించారు. గ్లోబల్‌ హెల్ప్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు గోట్టముక్కుల చెన్న కేశవులు, రాష్ట్ర హైకోర్టు సూపరిండెంట్‌ పీవీపీ అంజని కుమారి, దిశ ఫౌండేషన్‌ ప్రధాన కార్యదర్శి జక్కిరెడ్డి సుబ్బయమ్మ, నారాయణస్వామి, సంఘ సేవకులు నారా యణ రెడ్డి, నాగిరెడ్డి, కవులు, కళాకారులు, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు రవీందర్‌ను అభినందించారు.

మంచిర్యాలఅర్బన్‌: జంతువులకు కాపాడుదాం–ప్రకృతిని రక్షిద్దాం అనే సందేశంతో ప్రజల్లో చైతన్యం నింపేందుకు మంచిర్యాలకు చెందిన యువకుడు సందేశ్‌గుప్తా సైకిల్‌ యాత్ర చేపట్టాడు. ఏడాది పొడువునా 20వేల కిలోమీటర్ల (17 శక్తి పీఠాల) సైకిల్‌ యాత్ర విజయవంతంగా సాగుతోంది. గతనెల 20న మంచిర్యాల నుంచి ప్రారంభమైన ఫ్రెండ్స్‌ యానిమల్‌ ట్రస్ట్‌ ప్రతినిఽధి సంతోష్‌గుప్తా యాత్ర తొలిఘట్టంగా వెయ్యి కి.మీ ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని పూరి జగన్నాథస్వామి దివ్వ దర్శనం చేసుకున్నారు. తన తదుపరి పయనాన్ని జాజ్‌పూర్‌ గిరిజాదేవి శక్తిపీఠం వైపు కొనసాగిస్తున్నారు.

లారీ ఢీకొని కానిస్టేబుల్‌ మృతి

జైపూర్‌: మండలంలోని ఇందారం–టేకుమట్ల క్రాస్‌ రోడ్డు సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల మహిళా పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న పెర్క అంజిబాబు(40) మృతిచెందాడు. ఎస్సై భూమేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం..పెద్దపల్లి జిల్లాకు చెందిన అంజిబాపు ఉద్యోగరీత్యా నాగార్జున కాలనీలో ఉంటున్నాడు. భార్య పెర్క స్రవంతి, ఇద్దరు పిల్లలు మహశ్రీ(6), రుద్విక్‌(2)ను దసరా నేపథ్యంలో 10న వారి పుట్టినిళ్లు వద్ద దింపి మళ్లీ విధులకు హాజరయ్యాడు. ఆదివారం ఇందారం–టేకుమట్ల క్రాస్‌ రోడ్డు సమీపంలో గోదావరిఖని నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న లారీ ఆయన్ను ఢీ కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. 108లో మంచిర్యాల ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. భార్య స్రవంతి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement