బొగ్గుగని వార్తలు | - | Sakshi
Sakshi News home page

బొగ్గుగని వార్తలు

Oct 12 2026 3:55 AM | Updated on Oct 12 2026 3:55 AM

సింగరేణి కార్మిక గర్జన సభ జయప్రదం చేయండి

మందమర్రిరూరల్‌: గోదావరిఖనిలో ఈనెల 14న నిర్వహించే సింగరేణి కార్మిక గర్జన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక టీబీజీకేఎస్‌ యూనియన్‌ కార్యాలయంలో పార్టీ, యూనియన్‌ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులకు దిశా నిర్దేశం చేశారు. సభకు ముఖ్య అతిథులుగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరవుతున్నారని, అధిక సంఖ్యలో బీఆర్‌ఎస్‌ పార్టీ, యూనియన్‌ నాయకులు హాజరుకావాలని కోరారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌, టీబీజీకేఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

లాభాల వాటా చెల్లించాలి

శ్రీరాంపూర్‌: కంపెనీ గత ఆర్థిక సంవత్సరం సాధించిన వాస్తవ లాభాలను ప్రకటించి అందులో నుంచి కార్మికులకు వాటా చెల్లించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆ యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం శ్రీరాంపూర్‌ బస్టాండ్‌ వద్ద నిరసన తెలిపారు. యూనియన్‌ బ్రాంచి కన్వీనర్‌ రామగిరి రామస్వామి మాట్లాడుతూ ఆరు నెలలు గడుస్తున్న ఇప్పటికీ కంపెనీ వాస్తవ లాభాలను ప్రకటించలేదన్నారు. దసరాకు ముందు లాభాల వాటా చెల్లించాల్సి ఉండగా ఇప్పటికీ అతీగతి లేదన్నారు. నాటి బీఆర్‌ఎస్‌ విధానాలనే నేటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ ఫిట్‌ సెక్రెటరీలు సాయిల్ల శ్రీనివాస్‌, బెల్లం శ్రీధర్‌ తోడు సుధాకర్‌, మిడివెల్లి శ్రీనివాస్‌, గోదారి భాగ్యరాజ్‌, నరేశ్‌ వెంకటరెడ్డి పాల్గొన్నారు.

మందమర్రిలో బైక్‌ ర్యాలీ..

మందమర్రిరూరల్‌: సింగరేణికి గత ఆర్థిక సంవత్సరం వచ్చిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించాలని సీఐటీయూ మందమర్రి ఏరియా అధ్యక్షుడు వెంకటస్వామి డిమాండ్‌ చేశారు. యూనియన్‌ ఆధ్వర్యంలో ఆదివారం బైక్‌ ర్యాలీ అనంతరం పాత బస్టాండ్‌ కూడలి వద్ద ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో విదంగానే రాజకీయ జోక్యంతో సింగరేణిని భ్రష్టు పట్టిస్తుందని ఆరోపించారు. యూనియన్‌ డిప్యూటి జనరల్‌ సెక్రెటరీ రాజేందర్‌, నాయకులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement