బాసర: బాసర శ్రీ జ్ఞానసరస్వతి ఆలయంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. అనంతరం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి కట్టె పొంగలిని నైవేధ్యాన్ని సమర్పించారు. జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ దర్శించుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి 28వ ప్యాకేజీ పనులు త్వరగా మంజూరై పూర్తికావాలని కోరుతూ సంబంధిత పత్రాలను అమ్మవారి పాదాల చెంత సమర్పించారు. అలాగే భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో దేవీమాల ధరించి దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పి.సతీశ్వర్‌రావు తదితరులు ఉన్నారు.
పూజలో ఎమ్మెల్యే రామారావుపటేల్
క్యూలైన్‌లో భక్తులు, భవానీ దీక్షాపరులు


