కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. ప్రధానంగా అంబేడ్కర్, రాజీవ్‌గాంధీ చౌరస్తాలు, ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి వెళ్లే దారిలో వాహనాలు అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తుండగా నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఫలితంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నా యి. సుమారు 80వేల జనాభా ఉన్న పట్టణానికి ని త్యం సమీప గ్రామాలతోపాటు కౌటాల, సిర్పూర్, పెంచికల్‌పేట్, బెజ్జూరు, దహెగాం మండలాల నుంచి వ్యాపారాలు, విద్య, ఇతర అవసరాల నిమి త్తం 30వేల మంది వరకు వస్తుంటారు. దహెగాం, కౌటాల, బెజ్జూరు మండలాల నుంచి ప్రజలు అధికసంఖ్యలో కాగజ్‌నగర్‌కు చేరుకుంటారు. ప్రధానంగా రాజీవ్‌గాంధీ, తెలంగాణ తల్లి చౌరస్తాల మీదుగా బస్సులు, ఇతర వాహనాలు రాకపోకలు సాగి స్తుండడంతో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. దహెగాం, పెంచికల్‌పేట్ వైపు వెళ్లే వాహనాలు రై ల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి వెళ్తుంటాయి. నిత్యం ఈ బస్సుల రాకపోకలతో ఈ మార్గం రద్దీగా ఉంటుంది. మరోవైపు మెయిన్ సెంటర్‌లో ఆటోలు, ఇతర వాహనాలు అడ్డదిడ్డంగా నిలుపుతుండడంతో ట్రా ఫిక్ సమస్య తీవ్రమవుతోంది. దుకాణాల ఎదుట బైక్‌లు, ఆటోలు నిలుపుతుండడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. రహదారులపై చిరువ్యాపారులు బండ్లు ఏర్పాటు చేయడంతో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని పట్టణవాసులు కోరుతున్నారు.
అంబేడ్కర్ రోడ్డుపై అడ్డదిడ్డంగా వెళ్తున్న వాహనాలు
ప్రభుత్వ ఆస్పత్రి సమీప రోడ్డుపై నిలిపిన వాహనాలు


