ఆసిఫాబాద్‌రూరల్: క్రీడల్లో జిల్లాను ముందుంచాల ని ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో ని ర్వహించిన రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ పోటీలను ము ఖ్య అతిఽథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొట్టమొదటి సారిగా రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా వేదిక కావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. వి ద్యార్థులను మంచి క్రీడాకారులుగా తయారు చేసి జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణించేలా తీర్చి దిద్దాలని పేర్కొన్నారు. పోటీల్లో గెలుపోటములు సహజమని, ఓడినా నిరుత్సాహ పడకుండా గెలుపే లక్ష్యంగా సాధన చేయాలని సూచించారు. క్రీడలతో మంచి ఆరోగ్యం, స్నేహభావం పెరుగుతుందని తెలిపారు. క్రీడల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. నెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అలీబిన్ మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి నెట్‌బా ల్ పోటీలకు వెయ్యి మంది క్రీడాకారులు వచ్చినట్లు తెలిపారు. ప్రతిభ కనబర్చిన వారికి మెడల్స్ అందించనున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ ఆకాశ్, వైస్ చైర్మన్ అహ్మద్, నెట్ బాల్ అసోసియేష న్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి తిరుపతి, ప్రిన్సి పాల్ మహేశ్వర్, పీడీ, పీఈటీలు పాల్గొన్నారు.


