రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలో పని చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐ టీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్. తి రుపతి కోరారు. శనివారం గోలేటి టౌన్‌షిప్ లోని జీఎం కార్యాలయంలో ఏరియా జీఎం శ్రీరమేశ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖా ళీగా ఉన్న టైం రేటెడ్ ఉద్యోగాలను భర్తీ చే యాలని కోరారు. గోలేటి వైకుంఠధామంలో లైటింగ్ సౌకర్యం కల్పించాలని, సీ 2 టైప్ క్వార్టర్లలో చెడిపోయిన మంచినీటి పైపులైన్ కు వెంటనే మరమ్మతులు చేయించాలని విజ్ఞ ప్తి చేశారు. గోలేటి బ్రాంచి ఉపాధ్యక్షుడు బ య్య మొగిలి, జీఎం కమిటీ సభ్యులు శేషశయనరావు, రాజేశ్, శ్రీనివాస్, ఏరియా ఆర్గనైజింగ్ కార్యదర్శి కిరణ్‌బాబు, ఎంఏ సమీ, జూనియర్ అసిస్టెంట్ సతీశ్, నాయకులు అంజయ్య, నరేశ్, రమేశ్, గణేశ్ పాల్గొన్నారు.


