సిర్పూర్(టి): మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. మండలకేంద్రంతో పలు గ్రామాల్లో రెండు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ప్రధాన రహదారుల్లో ఉన్న భారీ వృక్షాలు నేలకొరిగాయి. కొన్నిచోట్ల ఇళ్లపై చెట్లు విరిగిపడ్డాయి. కొన్ని ఇళ్లు పూర్తిస్థాయిలో ధ్వంసం కావడంతో తీవ్రంగా నష్టపోయారు. రోడ్లపై చెట్లు విరిగి పడటంతో సిర్పూర్(టి) –కాగజ్‌నగర్, సిర్పూర్(టి) –కౌటాల ప్రధాన రహదారుల గుండా ప్రయాణాలు సాగించే ప్రయాణికులు, వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంకట్రావ్‌పేట గ్రామ సమీపంలో చెట్లు విరిగి రోడ్డుపై పడిపోవడంతో వాహనాలు గంటపాటు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. గత రెండురోజులుగా మండలంలోని ప్రజలు విద్యుత్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఎస్సై సాగర్ ఆధ్వర్యంలో పోలీసులు రహదారులపై విరిగి పడ్డ చెట్లను తొలగించారు.
సిర్పూర్(టి) –కాగజ్‌నగర్ రోడ్డుపై పడిన చెట్టు
గాలివానకు పడిపోయిన విద్యుత్ స్తంభం


