తేలని ‘గుర్తింపు’ ఎన్నికల వివాదం | - | Sakshi
Sakshi News home page

తేలని ‘గుర్తింపు’ ఎన్నికల వివాదం

Jun 11 2026 7:47 AM | Updated on Jun 11 2026 7:47 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: ఎస్పీఎం గుర్తింపు ఎన్నికల వివాదం ఎటూ తేలడం లేదు. స్పష్టమైన పరిష్కారం లేకుండానే ఇరువర్గాల మధ్య సమావేశం ముగిసింది. మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని 22 రోజులుగా కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు, ఎస్పీఎం ప్రతినిధులతో హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్‌ కార్యాలయంలో జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ చంద్రశేఖర్‌, రాజేంద్రప్రసాద్‌ సమక్షంలో సమావేశం నిర్వహించారు. కార్మిక సంఘాల నాయకులు వాదనలు వినిపించారు. ప్రజాస్వామ్య హక్కులు గౌరవిస్తూ వెంటనే వెరిఫికేషన్‌ ఎన్నికలు నిర్వహించాని కోరారు. ఎస్పీఎం ప్రతినిధులు మాట్లాడుతూ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహణ ప్రక్రియ కోర్టు పరిధిలో ఉందని, తీర్పుకు అనుగుణంగా చర్యలు చేపడుతామని వివరించారు. సమావేశంలో జేఏసీ నాయకులు సిర్పూర్‌ పేపర్‌ మిల్లు మజ్దూర్‌ యూనియన్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌, మాజీ కార్మికశాఖ మంత్రి పెద్దిరెడ్డి, ఎస్పీఎం ప్రతినిధులు శేషగోపాల్‌, ఎంఎస్‌ గిరి, కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement