ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు మద్యం తాగి వాహనాలు నడిపితే కేసు నమోదు నాలుగున్నర నెలల్లో 568 మందికి జరిమానాలు
ఆసిఫాబాద్‌అర్బన్: తాగి బండి నడిపితే జరిమానా తో సరిపెడతారు అనుకుంటే పొరపాటే.. ఇకపై ప్ర మాదాలకు కారణమయ్యే మందుబాబులపై పోలీ సుశాఖ కఠిన చర్యలు చేపడుతోంది. కేసులు నమో దు చేయడంతో పాటు వారి డ్రైవింగ్ లైసెన్స్‌లు శాశ్వతంగా రద్దు చేసేందుకు సిఫార్సు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు, వాహన తనిఖీలు పెంచారు. మద్యం తాగి వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
568 మందికి జరిమానాలు
జనవరి నుంచి ఇప్పటివరకు నాలుగున్నర నెలల్లో మద్యం తాగి వాహనాలను నడిపిన 2,256 మందికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. 568 మందికి రూ.9,72,200 జరిమానాలు విధించారు. మిగతా 1,688 కేసులు వివిధ కారణా లతో పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నా రు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల శాతాన్ని పూర్తిగా తగ్గించేందుకు క్షేత్రస్థాయిలో అధికారులను ఎప్పటికప్పుడు ఎస్పీ నితిక పంత్ అప్రమత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత అవగాహనా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు. మైనర్లు వాహనాలను నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులను బాధ్యులను చేస్తామని హెచ్చరిస్తున్నారు. రోడ్డు నియమాలు పాటించాలని కళాబృందాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.
శిక్షల మోతాదు పెంచుతూ..
మద్యం తాగి వాహనాలు నడిపితే దశలవారీగా శిక్ష ల మోతాదు పెంచుతున్నారు. పట్టుబడిన వారికి కు టుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరుస్తున్నారు. రెండోసారి పట్టుబడితే బ్రీత్ ఎనలైజర్‌లో రీడింగ్‌ను బట్టి కోర్టులో శిక్షలు విధిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ల రద్దుకు సిఫార్సు చేస్తున్నారు. జరిమానాతో పాటు జైలు శిక్షకు సైతం గురయ్యే అవకాశం ఉంది.
ప్రమాదాల నివారణే లక్ష్యం
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రతిరోజూ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నాం. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమైతే కేసులు నమోదు చేస్తున్నాం. నాలుగున్నర నెలల్లో అనేక మందిపై కేసులు నమోదు చేశాం. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు. ప్రమాదరహిత జిల్లాగా మార్చేందుకు ప్రతిఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలి.
– నితిక పంత్, ఎస్పీ


