20 నుంచి ‘ఓపెన్‌’ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

20 నుంచి ‘ఓపెన్‌’ పరీక్షలు

Apr 8 2026 8:02 AM | Updated on Apr 8 2026 8:02 AM

● అదనపు కలెక్టర్‌ డేవిడ్‌

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లాలో ఈ నెల 20 నుంచి 27 వరకు ఓపెన్‌ పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం డీఈవో లలిత, డీఐఈవో రాందాస్‌, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ఓపెన్‌ పది, ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 20 నుంచి 24 వరకు జరిగే ఓపెన్‌ పదో తరగతి పరీక్షలకు మూడు కేంద్రాలు ఏర్పాటు చేయగా, 643 మంది విద్యార్థులు హా జరుకానున్నట్లు తెలిపారు. అలాగే ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షలకు రెండు కేంద్రాలు ఏర్పాటు చేయగా, 360 మంది పరీక్ష రాస్తారని పేర్కొన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement