సాగునీటి రంగం బలోపేతంపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

సాగునీటి రంగం బలోపేతంపై దృష్టి

Apr 8 2026 8:02 AM | Updated on Apr 8 2026 8:02 AM

దహెగాం: సాగునీటి రంగాన్ని బలోపేతం చేయడంపై నీటిపారుదల శాఖ దృష్టి సారించిందని ఇరిగేషన్‌ డీఈఈలు అజయ్‌కుమార్‌, భద్రయ్య తెలిపారు. మండలంలోని కర్జి పెద్ద చెరువు వద్ద చేపట్టిన ప్రీ లెవల్‌ సర్వేను మంగళవారం పరిశీలించారు. వారు మాట్లాడు తూ కర్జి పెద్ద చెరువు పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.5.97 కోట్లు మంజూరు చేసిందన్నా రు. చెరువు ప్రస్తుత పరిస్థితి, చేపట్టాల్సిన ప నుల గురించి అంచనా వేస్తున్నట్లు తెలిపారు. పునరుద్ధరణ తర్వాత ఆయకట్టుకు శాశ్వతంగా సుమారు 500 ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. సాంకేతిక అనుమతులు పొందిన అనంతరం టెండర్లు పిలిచి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఏఈఈ మణితేజ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement