కాగజ్‌నగర్‌టౌన్: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కాగజ్‌నగర్ పో లీసుల ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో సైకిల్‌ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎస్పీఎం గేటు నుంచి రాజీవ్ గాంధీ చౌరస్తా మీదుగా లారీ చౌరస్తా గుండా ర్యాలీ కొనసాగింది. డీఎస్పీ వహీదుద్దీన్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమైక్యతకు చేసిన సేవలను గుర్తు చేశారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రూరల్ సీఐ కుమారస్వామి, ఎస్సై సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు.


