కాగజ్‌నగర్‌టౌన్: పట్టణ అభివృద్ధి, రోడ్ల విస్తరణలో కాగజ్‌నగర్‌లోని ప్రధాన రహదారులకు ఇరువైపులా అక్రమ కట్టడాలను మంగళవారం రాత్రి మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. స్థానిక ఈఎస్‌ఐ ఆస్పత్రి గేటు సమీపం నుంచి రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు ఎస్పీఎం క్వార్టర్స్ ప్రహరీ, ఖాళీగా ఉన్న ఎస్పీఎం క్వార్టర్లను కూల్చివేశారు. అగ్రసేన్ భవన్ సమీపంలోని మున్సిపల్ అద్దె భవనాలను సైతం కూ ల్చివేశారు. ఎస్పీఎం క్వార్టర్స్ తొలగింపుతో విస్తరణ పనులు వేగంగా జరుగుతాయని పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


