అంగరంగ వైభవంగా భీమయ్యక్ జాతర
తిర్యాణి మండలం దంతన్‌పల్లిలోని భీమయ్యక్ ఆలయ సమీపంలో శుక్రవారం జాతర అంగరంగ వైభవంగా సాగింది. ముందుగా ఆదివాసీలు ఆలయంలో సంప్రదాయ పూజలు చేశారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ జాతరకు హాజరై మాట్లాడారు. భీమయ్యక్ ఆలయాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. నీటి సదుపాయం, రోడ్డు, షెడ్డు నిర్మించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఆత్రం గంగారాం, ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆత్రం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. – తిర్యాణి
జాతరలో ఆదివాసీల కోలాహలం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్
అంగరంగ వైభవంగా భీమయ్యక్ జాతర
అంగరంగ వైభవంగా భీమయ్యక్ జాతర
అంగరంగ వైభవంగా భీమయ్యక్ జాతర


