కార్మికుల విజయం
● సీఐటీయూ ప్రధాన కార్యదర్శి కూశన రాజన్న
కార్మికుల తరఫున సిర్పూరు పేపరు మిల్లు మ జ్దూర్ యూనియన్ ఎంతో పోరాటం చేసిందని, హైకోర్టు వెలువర్చిన తీర్పును కార్మికుల విజ యంగా భావిస్తున్నామని సిర్పూరు పేపరు మి ల్లు మజ్దూర్ యూనియన్(సీఐటీయూ ఈ – 2510) ప్రధాన కార్యదర్శి కూశన రాజన్న పేర్కొన్నారు. పట్టణంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మిల్లు యజమాన్యం ఎన్నికలను అడ్డుకునేందుకు కోర్టును ఆశ్రయించింద ని, కార్మికులకు అన్యాయం జరుగకూడదని యూనియన్ ఆధ్వర్యంలో హైకోర్టును ఆశ్రయించామన్నారు. ఎన్నికల ప్రక్రియపై స్టే రాకుండా అడ్డుకున్నామని పేర్కొన్నారు. కౌంటర్ పిటిషన్ వేసి హైకోర్టులో న్యాయవాది ఆబిద్ హుస్సేన్ ద్వారా వాదనలను వినిపించామన్నారు. కార్మిక శాఖ అధికారులు చొరవ తీసుకుని ఎన్నికల తేదీలను ప్రకటించాలని, లేనిపక్షంలో కార్మిక శాఖ కార్యాలయం ఎదుట పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ముంజం శ్రీనివాస్, రాజన్న, అంగల శ్రీనివాస్, ఆర్.రాజన్న, భూమయ్య, ముంజం ఆనంద్‌కుమార్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు త్రివేణి తదితరులు పాల్గొన్నారు.


