నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల నియంత్రణ
ఆసిఫాబాద్: నేరస్తులకు కోర్టులో శిక్ష పడితేనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం పోలీసు అధికారులు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ కోర్టు కేసుల్లో శిక్షల శాతాన్ని పెంచడం ద్వారా ప్రజలకు పోలీసు శాఖపై మరింత నమ్మకం పెరుగుతుందన్నారు. కోర్టు కానిస్టేబుల్ కీలకమైన బాధ్యతని, ఎఫ్‌ఐఆర్ నమోదైనప్పటి నుంచి కేసు పూర్తయ్యే వరకు అవసరమైన సాక్షాలు కోర్టుకు సమర్పించడంపై దృష్టి సారించాలన్నారు. కోర్టు సమాచా రం, ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ఎస్‌హెచ్‌వోకు తెలియ జేయాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించారు. సమావేశంలో డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, స్పెషల్ బ్రాంచి ఇన్‌స్పెక్టర్ సతీశ్, సీఐలు, ఎస్సైలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.


