9లోగా అభ్యంతరాలు సమర్పించాలి
ఆసిఫాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వార్డు ల వారీగా ఓటరు జాబితాపై ఈ నెల 9లోగా అభ్యంతరాలు సమర్పించాలని కలెక్టర్ వెంకటేశ్ దో త్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు దీప క్ తివారి, డేవిడ్, కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ శ్రద్ధాశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్ రావులతో కలిసి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల ప్రదేశాల విషయంలో అభ్యంతరాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీలకు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించామని, జా బితాలో పొందుపరిచిన వివరాలను ప్రతీ ఓటరు పరిశీలించుకోవాలన్నారు. జాబితాలోని పేర్లపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 9లోగా లిఖితపూర్వకంగా సమర్పించాలని తెలిపారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 13,905 మంది ఓటర్లు ఉండగా, 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. ఎన్నికల కమిషన్ నిబంధనలు ప్రతీఒక్కరు పాటించాలని పేర్కొన్నారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. టీపోల్‌యాప్‌లో వార్డుల వారీగా ఓటరు జాబితా పరిశీలించుకోవచ్చని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే వార్డులో ఉండే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అవకతవకలకు అవకాశం లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించేందుకు బూతుస్థాయి ఏజెంట్లు సహకరించాలని తెలిపారు. సమావేశంలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపల్ కమిషనర్లు గజా నంద్, రాజేందర్, పట్టణ ప్రణాళికా అధికారి య శ్వంత్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతి నిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


