ఓటరు జాబితాలో తప్పులు సవరిస్తాం
ఆసిఫాబాద్‌అర్బన్: ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరి ధిలో రానున్న ఎన్నికల కోసం ప్రచురించిన డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో తప్పులను సవరిస్తామని మున్సి పల్ ప్రత్యేక అధికారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావ్ తెలిపా రు. ముసాయిదా జాబితాపై పలువురు అభ్యంత రం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సోమవారం అన్ని పార్టీల నాయకులతో మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గజానంద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 10వ తేదీ వరకు అవకాశం ఉందని, రాతపూర్వకంగా ఫిర్యాదులు అందజేయాలన్నారు. ఓటు లేనివారు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లేదని, గతంలో ఓటు ఉండి పేరు రానివారు దరఖాస్తుల చేసుకుంటే ఎన్నికల కమిషనర్‌కు అందజేస్తామన్నారు. సోమవారం వరకు 15 మంది అభ్యంతరాలకు సంబంధించి లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ముసాయిదా జాబితాపై వచ్చిన ప్రతీ ఫిర్యాదు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో టీపీవో యశ్వంత్‌కుమార్, వివిధ పార్టీల నాయకులు చిలువేరు వెంకన్న, మాటూరి జయరాజ్, సాంగ్డె జీవన్, సలీం, నిసార్, వసంత్‌రావ్, మల్లికా ర్జున్, శ్రీనివాస్, నారాయణ, రాజు పాల్గొన్నారు.


