మత్తు.. ప్రమాదాల్లో చిత్తు
విచ్చలవిడిగా మద్యం, గంజాయి అమ్మకాలు మత్తులో వాహనదారుల ర్యాష్ డ్రైవింగ్ ఆందోళన కలిగిస్తున్న రోడ్డు ప్రమాదాలు
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ పట్టణంలో విచ్చలవి డిగా కొనసాగుతున్న బెల్టుషాపులు, అర్ధరాత్రి వర కు లభిస్తున్న మద్యం, గంజాయితో యువత మత్తు కు బానిసలుగా మారుతున్నారు. మత్తులో వాహనా లతో రోడ్లపైకి వస్తుండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల కాగజ్‌నగర్ పట్టణంలో జరిగిన పలు ప్రమాదాలు మత్తులోనే జరిగినట్లు పోలీసులు గుర్తించారు. డిసెంబర్‌లో రెండు బైక్‌లు ఢీకొన్ని ఘటనలో ఒకరు మృత్యువాత పడ్డారు. పట్టణంలోని కొన్ని కిరాణషాపుల్లో కూడా మద్యం లభిస్తోంది. అర్ధరాత్రి దాటే వరకు అమ్మకాలు సాగిస్తున్నారు. పోలీసులు అడపాదడపా తనిఖీ చేస్తున్నా.. వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా అధిక రేట్లకు విక్రయిస్తున్నారు.
నిర్మానుష్య ప్రాంతాలను ఎంచుకుని..
పట్టణంలో రైల్వే స్టేషన్‌కు ఆనుకుని ఉన్న కాపువాడ, సీబాపుకాలనీ, నిజాముద్దీన్ కాలనీ, రైల్వే కాలనీలో రాత్రిపూట యువకులు గంజాయిని సేవించి మత్తులో జోగుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతాలైన కాపువాడ, ఆర్‌ఆర్‌వో కాలనీ, సీబాబుకాలనీ, భట్టుపల్లి రోడ్, చారిగాం రోడ్, డాడానగర్, వినయ్ గార్డెన్ ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. చీకటిపడితే ఇంట్లో నుంచి బయటకు వెళ్లడానికి పట్టణవాసులు జంకుతున్నారు. బస్సు, రైల్వే స్టేషన్‌లలో దిగిన మహిళలు ఒంటరిగా వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారు. రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఆకతాయిల బెడద పెరిగిపోయిందని, చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గస్తీ పెంచుతాం
రైల్వే స్టేషన్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో గస్తీని పెంచుతాం. అర్ధరాత్రి వేళల్లో బెల్టుషాపుల నిర్వహించే వా రిపై చర్యలు తీసుకుంటాం. శాంతి భద్రతలకు ఆటంకం ఏర్పడితే తమకు ఫిర్యాదు చేయాలి. వెంటనే సిబ్బందిని పంపించి సమస్య పరిష్కరించడంతోపాటు నిందితులను అదుపులోకి తీసుకుంటాం. అధిక వేగంతో వెళ్లే వాహనదారులను పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటాం.
– వహీదుద్దీన్, డీఎస్పీ, కాగజ్‌నగర్
నవంబర్ 16న కాగజ్‌నగర్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో మత్తులో ఓ కారు డ్రైవర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో స్తంభం పూర్తిగా విరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగ్గపోయినా ఆస్తినష్టం వాటిల్లింది. డ్రైవర్ దుర్గం రాహుల్‌ను పోలీసులు బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా, మద్యం మత్తులో ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అధిక మద్యం సేవించడంతోనే 99 ఎంజీ ఆల్కహాల్ పాజిటివ్‌గా వచ్చినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేశారు.
మత్తు.. ప్రమాదాల్లో చిత్తు


