టెట్‌కు దూరభారం
ఆసిఫాబాద్‌రూరల్: టెట్ అభ్యర్థులకు దూరభారంతో ఇబ్బందులు తప్పడం లేదు. మొదటిరోజు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సైతం వారు చివరి ఆప్షన్‌లో పెట్టుకున్న పట్టణాల్లో కేంద్రాలను కేటాయించారు. వందలాది కిలోమీటర్లు ప్రయాణించాల్సి రావడంతో ఒకరోజు ముందుగానే పట్టణాలకు వెళ్తున్నారు. ఈ నెల 3 నుంచి ప్రారంభమైన పరీక్షలు ఈ నెల 20 వరకు కొనసాగనున్నాయి. జిల్లా నుంచి 2,735 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఉపాధ్యాయులు 1,102 మంది కాగా, 1,633 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి కావడంతో నిరుద్యోగులతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులు పరీక్షలకు హాజరవుతున్నారు.
హుజురాబాద్‌లో రాశా
నేను చింతలమానెపల్లి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నా. ఇటీవల హుజురాబాద్‌లో టెట్ రాశా. 2010 కంటే ముందు నియామకమైన టీచర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయాలి.
– మానిక్‌రావు, సైన్స్ టీచర్
టెట్‌కు దూరభారం


