సూపర్‌ఫాస్ట్ రైళ్లు ఆపాలి
రెబ్బెన: మండల కేంద్రంలోని ఆసిఫాబాద్ రోడ్ రై ల్వేస్టేషన్‌లో సూపర్‌ఫాస్ట్ రైళ్లు ఆపాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ కో రారు. శనివారం బెల్లంపల్లి రైల్వేస్టేషన్‌లో ఏరియా రైల్వే అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ గోపిని ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలి శారు. ఆయన మాట్లాడుతూ.. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఒక్కగానొక్క రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ లేక ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే బెల్లంపల్లి, కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్ల నుంచి రాకపోకలు సాగించాల్సి వ స్తోందని పేర్కొన్నారు. అధికారులు చొరవ తీసుకు ని సూపర్‌ఫాస్ట్ రైళ్లు ఆపాలని కోరారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని రైల్వే ఏడీఈఎన్ హామీ ఇచ్చినట్లు తెలి పారు. ఆటో యూనియన్ గౌరవాధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్, ఉపాధ్యక్షుడు రాజాగౌడ్, నాయకులు శంకర్, విజయ్, సంతోష్, మోహన్ తదితరులున్నారు.


