విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలి
వాంకిడి: వినియోగదారులు విద్యుత్‌ను పొ దుపుగా వాడాలని ఎస్‌ఈ ఉత్తమ్ జాడె సూ చించారు. శనివారం మండలంలోని ఇందాని గ్రామంలో విద్యుత్ వినియోగం, తీసుకోవా ల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలు సూచనలతో కూడిన కరపత్రం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ కనెక్షన్లు తీసుకుంటే ప్ర మాదాలు జరిగే అవకాశాలున్నట్లు తెలిపా రు. ఇంట్లో ఎవరూ లేనపుడు టీవీ, ఫ్యాన్లు, కూలర్లు బంద్ చేసుకోవాలని సూచించారు. ఎలాంటి విద్యుత్ సమస్యలున్నా శిక్షణ పొందిన ఎలక్ట్రీషియన్‌తో మరమ్మతులు చేయించుకోవాలని తెలిపారు. ఎస్‌ఏవో దేవిదాస్, ఏడీఈ శ్రీనివాస్, ఎస్‌ఎల్‌ఐ శ్రీనివాస్, ఎల్‌ఐ రవి, సురేందర్, సిబ్బంది పాల్గొన్నారు.


